Saindhav on OTT : విక్టరీ వెంకటేష్ తన 75 వ చిత్రం ‘సైంధవ్’ తో ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం విడుదలకు ముందు భారీ అంచనాలను ఏర్పాటు చేసుకుంది. నేటి తరం యూత్ ఆడియన్స్ నచ్చే విధంగా డైరెక్టర్ శైలేష్ కొలను మంచి యాక్షన్ సన్నివేశాలను పెట్టాడని, కచ్చితంగా వెంకటేష్ కెరీర్ లో మర్చిపోలేని చిత్రం గా మిగిలిపోతుందని అనుకున్నారు.
నిజంగానే ఈ చిత్రం వెంకటేష్ కి మర్చిపోలేని చిత్రం గానే మిగిలింది. అది సక్సెస్ అయ్యి కాదు, కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా, ఒక చేదు జ్ఞాపకం లాగ మిగిలిపోయింది. విడుదలైన మొదటి ఆట నుండే డివైడ్ టాక్ తెచుకున్నప్పటికీ కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కేవలం 25 కోట్ల రూపాయలకే కదా, కచ్చితంగా సంక్రాంతి సెలవుల్లో బ్రేక్ ఈవెన్ అయిపోతుందిలే అని అనుకున్నారు ట్రేడ్ పండితులు.
కానీ చివరికి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గానే మిగిలింది ఈ చిత్రం. సంక్రాంతి పండుగకి వచ్చి కనీసం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది అంటే ఎంత పెద్ద ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే ట్రేడ్ పండితుల కథనం ప్రకారం సంక్రాంతి కారణంగానే ఈ సినిమా సూపర్ హిట్ కాలేదని అంటున్నారు.
ఎందుకంటే సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు చూసేందుకే ఇష్టపడతారని, అలాంటిది వెంకటేష్ ఏకంగా యాక్షన్ ఎంటర్టైనర్ తో రావడం, దానికి తోడు ‘హనుమాన్’ మూవీ మేనియా నడుస్తుండడంతో ఈ సినిమాకి అలాంటి ఫలితం వచ్చిందని, లేకపోతే అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యే కంటెంట్ కాదు అనేది విశ్లేషకుల అభిప్రాయం.
థియేటర్స్ లో నిరాశపర్చిన ఈ సినిమా రేపటి నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అంటే ఈరోజు అర్థరాత్రి 12 గంటల నుండే అందుబాటులోకి రాబోతుంది అన్నమాట. కొన్ని సినిమా థియేటర్స్ లో బాగా ఆడినప్పటికీ ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడు మాత్రం మిశ్రమ స్పందన దక్కించుకుంటూ ఉంటాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఓటీటీ లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటూ ఉంటాయి. మరి ‘సైంధవ్’ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ని దక్కించుకోబోతుందో చూడాలి.