JAISW News Telugu

Saindhav Collections : ‘సైంధవ్’ మూవీ మొదటి వారం వసూళ్లు..20 ఏళ్ళ తర్వాత డిజాస్టర్ ని అందుకున్న వెంకటేష్!

'Saindhav' movie first week collections

‘Saindhav’ movie first week collections

Saindhav Collections : సీనియర్ హీరోలలో కెరీర్ మొత్తం మీద అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది విక్టరీ వెంకటేష్ అనే చెప్పాలి. మినిమం గ్యారంటీ సబ్జక్ట్స్ తో అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి ఎప్పుడూ ముందు ఉంటాడు ఆయన. అందుకే ఒక్కోసారి డివైడ్ టాక్ వచ్చినా కూడా, తన ఫ్యామిలీ ఆడియన్స్ తో సినిమాని బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరకి తీసుకొస్తూ ఉంటాడు.

74 చిత్రాలను పూర్తి చేసుకొని, 75 చిత్రం గా ‘సైంధవ్’ చిత్రం తో మన ముందుకు వచ్చాడు విక్టరీ వెంకటేష్. జనవరి 13 వ తారీఖున భోగి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా కి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం కమర్సియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.  నేటితో సరిగ్గా వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 25 కోట్ల రూపాయలకు జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది. సంక్రాంతి సెలవులు ఇక ముగియడం తో ఈ చిత్రానికి వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఈ వీకెండ్ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టి, జనవరి 26 వ తేదీ వరకు హోల్డ్ చేసుకోగలిగితే ఈ సినిమా మరో 5 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టే అవకాశం ఉంటుందని, లేకపోతే 15 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. గడిచిన రెండు దశాబ్దాలలో వెంకటేష్ కెరీర్ లో ‘సుభాష్ చంద్రబోస్’ అనే చిత్రం ఈ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.

మళ్ళీ ఇన్నాళ్లకు ‘సైంధవ్’ చిత్రం తో ఫ్లాప్ ని ఎదురుకున్నాడని అంటున్నారు ట్రేడ్ పండితులు. మధ్యలో ‘షాడో’ అనే చిత్రం వచ్చింది కానీ, అప్పటి మార్కెట్ కి ఆ సినిమా ఫ్లాప్ రేంజ్ లో నిల్చింది. కానీ ‘సైంధవ్’ చిత్రం మాత్రం వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి జనవరి 26 వరకు థియేట్రికల్ రన్ వచ్చే అవకాశం ఉండడం తో, ఎంత వసూళ్లను రాబడుతుందో ఒకసారి చూద్దాం.

Exit mobile version