Saidharam Tej : పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం

Saidharam Tej Helps to Pavala Shyamala
Saidharam Tej : టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ సీనియర్ నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయం చేశారు. ఆమె కష్టాల్లో ఉన్నట్లు తెలుపుకున్ని ఆయన చలించిపోయారు. సాయం చేస్తానని గతంలో ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పలు ఆరోగ్య సమస్ల వల్ల వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతున్న పావలా శ్యామలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా ఆ డబ్బును ఆమెకు అందించారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మా అమ్మాయికి ఆపరేషన్ అయినప్పుడు సాయిధరమ్ తేజ్ నాకు ఫోన్ చేశారు. ధైర్యం చెప్పారు. వచ్చి కలుస్తానన్నారు. చాలా రోజులైపోయింది. నన్ను మర్చిపోయారేమో అనుకున్నా. కానీ, నన్ను గుర్తుపెట్టుకొని సాయం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు’’ అని తెలిపారు.
ఆమె సాయిధరమ్ తేజ్ తో వీడియో కాల్ లో మాట్లాడుతూ చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. గతంలో ఆసుపత్రి ఖర్చులకు కూడా డబ్బు లేదు. దీంతో నా కూతురితో సహా చనిపోదామనుకున్నా.. సమయానికి మీరు సాయం చేసి నాకూ, నా కూతురికి ప్రాణభిక్ష పెట్టారని కన్నీళ్లు పెట్టుకున్నాు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కు రూ.5 లక్షలు సాయిధరమ్ తేజ్ విరాళం ఇచ్చారు. దానిలో భాగంగా రూ.లక్షను పావలా శ్యామలకు అందించారు. గతంలో చిరంజీవి చేసిన సాయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు.