Sai Pallavi : అమీర్ ఖాన్ కొడుకుతో సాయి పల్లవి రొమాన్స్..ఆశ్చర్యపోతున్న అభిమానులు!

Sai Pallavi's romance with Aamir Khan's son

Sai Pallavi romance with Aamir Khan’s son

Sai Pallavi – Junaid Khan : మన టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటి ఎవరైనా ఉన్నారా అంటే అది సాయి పల్లవి అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. లేడీ పవర్ స్టార్ అంటే ఆ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది అని అర్థం. అందాల ఆరబోతలకు మాత్రమే హీరోయిన్స్ పరిమితమైన ఈ రోజుల్లో ఒక హీరోయిన్ కేవలం నటనకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు.

అంతే కాదు ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ఎంత కట్టుబాట్లు ఉన్న హీరోయిన్ అయినా ఎదో ఒక సందర్భంలో మేకర్స్ డిమాండ్ కోసం హద్దులు చెరిపేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భం వస్తే సినిమాలు చెయ్యడం అయినా మానేస్తాను కానీ, నేను నమ్ముకున్న సిద్ధాంతాలను మాత్రం మర్చిపోను అనే మనస్తత్వం ఉన్న హీరోయిన్ సాయి పల్లవి. రీసెంట్ గా ఈమె ఎలాంటి సినిమాలోనూ కనిపించలేదు. ‘గాగ్రి’ చిత్రం తర్వాత ఆమె సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చింది.

ఆమె అంతలా గ్యాప్ ఇవ్వడానికి కారణం సరైన స్క్రిప్ట్ దొరకకపోవడమే. అయితే ఈమె ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ రెండవ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ విషయం గత కొంతకాలం గా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నా, అధికారికంగా ఖరారు కాలేదు. కానీ ఈ సినిమా షూటింగ్ కోసం ఆమె త్వరలో జపాన్ కి వెళ్ళబోతున్నాను అని ఒక మీడియా కి తెలపడం తో అధికారికంగా ఈ ప్రాజెక్ట్ లో సాయి పల్లవి నటిస్తున్నట్టు ఫ్యాన్స్ కి తెలిసింది. ఇదే ఆమె మొట్టమొదటి బాలీవుడ్ చిత్రం కూడా. ఈ సినిమాకి ముందు ఆమె ఎక్కువగా టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతోనే నటించింది. ఈ సినిమాని అమీర్ ఖాన్ తో పాటుగా యాష్ రాజ్ సంస్థ కూడా కలిసి సంయుక్తంగా నిర్మిస్తుంది.

ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి అయ్యిందట. ప్రస్తుతం చెల్లి పెళ్లి పనుల్లో నిన్నటి మొన్నటి వరకు బిజీ గా ఉన్న సాయి పల్లవి త్వరలోనే ‘తండేల్’ మూవీ షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టనుంది. ఈ షెడ్యూల్ పూర్తి అయిపోయిన తర్వాత ఆమెకి జునైద్ ఖాన్ సినిమా కోసం జపాన్ కి వెళ్లబోతుంది. ఈ ప్రాజెక్ట్ హిట్ అయితే సాయి పల్లవి కి బాలీవుడ్ లో మామూలు రేంజ్ మార్కెట్ రాదనే చెప్పొచ్చు.

TAGS