Sai Dharam Tej : పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో మెగా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. సాయి ధరమ్ తేజ్ పవన్ కల్యాణ్ గెలుపు కోసం చాలా కష్టపడ్డాడు. పిఠాపురంలో ప్రతి విలేజ్ కు వెళ్లి ప్రచారం నిర్వహించాడు. పవన్ గెలిచిన తర్వాత మెగా కుటుంబాన్ని కలిసేందుకు హైదరాబాద్ వచ్చాడు. ఈ సమయంలో ఆయనకు కుటుంబ సభ్యులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి పవన్ కల్యాణ్ కు స్వాగతం పలకగా.. పవన్ అన్నయ్య కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ తన తల్లి అంజనమ్మ కాళ్లు మొక్కాడు. రాంచరణ్ తేజ్ పవన్, అన్నా లెజినోవా కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సమయంలో పవన్ ఆనందంతో నవ్వుతూ కనిపించాడు. కానీ నాగబాబు మాత్రం ఏమోషన్ తట్టుకోలేక ఏడ్చేశాడు.
పవన్ కు గ్రాండ్ వెలకమ్ ఇచ్చిన తర్వాత చిరంజీవి భారీ పూల మాల వేసి అభినందనలు తెలిపాడు. పవన్ కు ఇంటి లోపల కేక్ కట్ చేయించారు. పవన్ హ్యట్సాప్ అని రాసి ఉంచిన కేక్ కట్ చేసి చిరంజీవి పవన్ కు తినిపించాడు. ఈ సమయంలో సాయి ధరమ్ తేజ్ వెనక నుంచి ఈలలు కొడుతూనే ఉన్నారు. దీంతో ఒకసారి చిరంజీవి ఆపరా బాబు అన్నాడు.అయినా వినకుండా ఈలలు వేస్తూ అల్లరి చేస్తూనే ఉన్నాడు.
సాయి ధరమ్ తేజ్ చేస్తున్న అల్లరిని గమనించిన పవన్ కల్యాణ్ ఒక్క చూపు చూశాడు. కాస్త తగ్గినట్లు కనిపించిన తేజ్ మళ్లీ ఈలలు వేస్తూ ఆనందంలో మునిగిపోయాడు. ఇలా మెగా కుటుంబం మొత్తం సంబరాల్లో మునిగిపోయారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన పది సంవత్సరాలకు ఇప్పుడు గెలిచారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి రెండు నియోజకవర్గాల్లో ఓడిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.