Pawan Kalyan : పవన్ కు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. మామా అల్లుళ్ల బంధం ముచ్చేటేస్తోందంటూ.. నెటిజన్ల కామెంట్స్

Sai Dharam Tej – Pawan Kalyan
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి భారీ విజయం సాధించిన తర్వాత డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే సాయి ధరమ్ తేజ్ పవన్ కల్యాణ్ కు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఐకానిక్ ’స్టార్ వార్స్ లెగో మిలినీయం ఫాల్కన్’ అనే స్పెషల్ గిఫ్గ్ ఇచ్చాడు. నా చిన్న నాటి నుంచి మీతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ దీన్ని గిఫ్గ్ గా ఇస్తున్నట్లు చెప్పారు.
సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన గిఫ్ట్ దాదాపు రూ.1.2 లక్షలని తెలుస్తోంది. అంతకుముందు చిరంజీవి భార్య సురేఖ కూడా పవన్ కల్యాణ్ కు ఒక భారీ గిఫ్ట్ ఇచ్చింది. రూ. 2.5 లక్షల విలువ చేసే పెన్ను గిఫ్ట్ ఇచ్చింది. అయితే సాయి ధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ ల మధ్య ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని అర్థమవుతుంది. మామయ్య కోసం సాయిధరమ్ తేజ్ పడిన కష్టం.. ఎన్నికల్లో చేసిన ప్రచారం ఇలా అన్నికలగలిపి వీరిద్దరి అనుబంధంపై ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన 21 సీట్లలో పోటీ చేసి.. 21 సీట్లలో గెలిచి రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు దేశంలో ఎవరూ కూడా ఇలా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవలేరు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం రిజల్ట్ సాధించి పవన్ కల్యాణ్ అంటే ఎంటో నిరూపించాడు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ.. పవన్ కల్యాణ్ గెలవడంతో ఎంతో ఆనందంలో మునిగిపోయింది. మరిదికి ఎప్పటికీ మరిచిపోలేని ఒక గిఫ్ట్ ఇచ్చింది. మోంట్ బ్లాంక్ వాల్డ్ డిస్నీ అనే రూ. 2.50 ఖరీదైన పెన్నును గిఫ్ట్ గా ఇచ్చింది.