JAISW News Telugu

Journalist : పాత్రికేయుడి నుంచి పాటల రచయితగా ఎదిగిన  సాహితీ కుసుమం

Journalist

Journalist and Writer baskar Batla

Journalist to Writer : సినీరంగంలో ఎప్పుడు ఎవరికి ఎలా అవకాశం తడుతుందో చెప్పలేం. అలా కొందరు తమ సినిమా కలను నెరవేర్చుకోవడానికి ఏళ్ల తరబడి ఎదురు చూస్తుంటారు. అలాంటి వారిలో ఓ పాటల రచయిత కూడా ఉన్నాడు. తన సాహిత్యంతో దాదాపు పాతికేళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

తెలుగు సినీ గేయ రచయిత భాస్కరభట్ల. ఆయన పూర్తి పేరు భాస్కరభట్ల రవి కుమార్.  తెలుగులో పాటల రచయితల్లో అగ్రస్థానంలో ఉన్నారు. భాస్కరభట్ల రవి కుమార్ ముందు పాత్రికేయుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు. పదేళ్ల పాటు జర్నలిస్టుగా కొనసాగాడు.  చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువ ఉండడంతో పుస్తకాలు ఎక్కువగా చదివేవాడు.  పాటల రచయిత కావాలనే ఆసక్తితో ముందు చిన్నగా కవిత్వాలు రాయడం మొదలుపెట్టాడు. అలా తన ప్రతిభను మెరుగుపర్చుకున్నాడు. ఇక తన ఆలోచనలనే అవకాశంగా మలుచుకొని సినిమాల్లో అవకాశాల కోసం పరుగులు తీయడం ప్రారంభించాడు. అలా 2000లో నందమూరి బాలకృష్ణ హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘గొప్పింటి అల్లుడు’ సినిమాతో తొలి అవకాశాన్ని అందుకున్నాడు.  ఈ చిత్రంతో గీత రచయితగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. భాస్కరభట్లకు తనికెళ్ల భరణి, దివంగత మ్యూజిక్ డైరెక్టర్ తో మంచి అనుబంధం ఉండేది. గీత రచయితగా చక్రి ఎక్కువగా ప్రోత్సహించాడు. వీరిద్దరూ దాదాపు 65కు పైగా చిత్రాలకు కలిసి పనిచేశారు. భాస్కర భట్లను ప్రోత్సహించిన వారిలో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఒకరు. పూరీ జగన్నాథ్ తన ప్రతి సినిమాలో భాస్కరభట్లతో పాటలు రాయించుకుంటుంటాడు.

భాస్కరభట్ల ఇప్పటి వరకు తెలుగులో 300కి పైగా సినిమాలకు సాహిత్యం అందించాడు. కాగా, వీటిలో ఎక్కువగా ఇట్లు శ్రావణి సుబ్రమణ్యంలోని ‘మళ్లీ కుయవే గువ్వ’, పోకిరిలోని ‘ఇప్పటికింకా నా వయసు’ , బొమ్మరిల్లులోని ‘బొమ్మను గీస్తే ‘, జల్సాలోని ‘గాల్లో తేలినట్టుందే’ , బంపర్ ఆఫర్‌లోని ‘పెళ్లెందుకే రావణమ్మ వంటి పాటలు భాస్కరభట్లకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.

డబ్బింగ్ సినిమాలకు పాటలు రాయడం అంత సులువుకాదు. కానీ భాస్కరభట్ల వాటిని చాలా సులువుగా రాసేస్తుంటారు. సూర్య తమిళ సినిమా ఆకాశం నీ హద్దురా(సూరారై పోట్రు)  సినిమాలో..  కాటుక కనులే అనే పాటను తెలుగులో రాసి సంచలనం సృష్టించాడు. కరోనా సమయంలో ఓటీటీలో విడుదలైంది. సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో కాటుక కనులే పాట కూడా అంతే హిట్టయ్యింది. ఇప్పటికీ తెలుగు జనాల నోట ఈ పాటు వినిపిస్తుంటుంది. తాజాగా దర్శకుడు పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కనున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ‘స్టెప్పమార్’ సాంగ్ కు కూడా భాస్కరభట్ల అదిరిపోయే మాస్ బిట్ సాహిత్యాన్ని అందించాడు.  ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నది.

కుటుంబ నేపథ్యం.
భాస్కర భట్ల కుటుంబం శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు.  గార మండలం బూరవెల్లి గ్రామంలో  1974 జూన్ 5న జన్మించారు. భాస్కరభట్ల తెలుగులో బీఏ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత.. హైదరాబాద్ వచ్చి పాత్రికేయుడిగా తన ప్రస్థానాన్ని సాగించారు. సినీ ఇండస్ట్రీలో పాటల రచయితగా గుర్తింపు తెచ్చుకున్న భాస్కరభట్ల పెళ్లినాటి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇందులో భాస్కరభట్ల దంపతులను  నెటిజన్లు గుర్త పట్టలేకపోతున్నారు.

Exit mobile version