Subrata Rai Passed Away : సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతోరాయ్ కన్నుమూత

Subrata Rai Passed Away

Subrata Rai Passed Away

Subrata Rai Passed Away : సహారా ఇండియా చైర్మన్ సుబ్రతా రాయ్ మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొదుతున్నారు. కాగా, మంగళవారం రాత్రి ఆయన కన్నుమూశారు. ఇక ఆయన పార్థివ దేహాన్ని లక్నోలోని సహారా షహర్ కు తరలిస్తున్నారు. అక్కడ ఆయనకు నివాళులర్పించనున్నారు.

అయితే ముంబైలోని ఓ ప్రైవేట్ దవాఖానలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయనకు మంగళవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చింది.  అయితే ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో,ఈ నెల  12న కోకిలా బెన్ దవాఖానలో వైద్యం కోసం చేరాడు. రాయ్ కొంతకాలంగా క్సాన్సర్ బాధపడుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా రాయ్ మృతిని ధ్రువీకరిస్తూ, సంతాపం తెలుపుతూ సహారా గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది తమకెంతో బాధతృప్త సమయమని పేర్కొంది.

కాగా రాయ్, 1948 జూన్ 10 న జన్మించారు. ఆయన బిహార్ లోని అరారియా జిల్లాలో పుట్టారు. ఇక కొల్ కతాలో తన ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. గొరఖ్పూర్ లోని ప్రభుత్వ కాలేజీలో డిప్లొమాలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇక సహరా సంస్థను 1978లో ఇదే గొరఖ్ పూర్ నుంచి సుబ్రతారాయ్  ప్రారంభించారు. ఎన్నో కష్టనష్టాల కొర్చి ఆయన ఈ స్థాయికి తన వ్యాపారాన్ని తీసుకొచ్చాడు.

గతంలో ఎన్ని విమర్శలు వచ్చినా, నమ్మకాన్ని కొల్పోకుండా సంస్థను కాపాడుకుంటూ వస్తున్నారు. అందరికీ స్పూర్తి దాయకమైన జీవితాన్ని సుబ్రతారాయ్ గడిపారని ఈ సందర్భంగా పలువురు వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులు కొనియాడారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే సుబ్రతోరాయ్ అంత్యక్రియలు లక్నోలోనే జరగనున్నట్లు సమాచారం.

TAGS