Sachins Daughter Wedding Soon : సచిన్ టెండుల్కర్ గారాల కూతురు సారా గురించి పరిచయం అక్కర్లేదనుకుంటా? అయితే ఆమెకు వివాహం చేయాలని సచిన్ టెండుల్కర్ అంజలి అనుకుంటున్నారట. ఈ సమయంలోనే సారా వారికి తీపి కబురు చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. సారా టెండుల్కర్, శుభమన్ గిల్ లవ్ లో ఉన్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి సంబంధించి కొన్ని ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో కూడా రావడంతో వేగంగా వైరల్ అయ్యాయి.
దీనికి తోడు శుభమన్ గిల్ ఆడిన ప్రతీ మ్యాచ్ కు సారా టెండుల్కర్ తప్పనిసరిగా అటెండ్ కావడం, శుభమన్ ను ఎంకరేజ్ చేస్తుండడంతో అందరూ వీరి లవ్ నిజమే అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వీరు త్వరలోనే జంట కాబోతున్నారని కామెంట్లు కూడా పెరుగుతున్నాయి. మరింత ముందుకు వెళ్లి వీరికి వివాహం డేట్ కూడా ఫిక్స్ చేశారని కూడా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం శుభమన్ గిల్ ఐసీసీ ర్యాంకింగ్ లో నెం. 1 ప్లేస్ లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో సారా ఆయనకు కంగ్రాట్స్ చెప్పడంతో పాటు లవ్ సింబల్ కూడా షేర్ చేసిందట. వారి మధ్య ఉన్న లవ్ ను సారా చెప్పకనే చెప్పిందని దానికి అందరూ కామెంట్లు పెడుతున్నారు. గిల్ సెంచరీ పూర్తయిన తర్వాత సారా డ్యాన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ పరిణామాలకు తోడు ఇటీవల వీరి రిలేషన్ షిప్ పై యూఏఈ క్రికెటర్ చిరాగ్ సూరి కూడా ఒక ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో ‘తర్వాత పెళ్లి చేసుకోబోతున్న క్రికెటర్ ఎవరు?’ అని యాంకర్ ప్రశ్నించగా. ‘శుభమన్ గిల్’ అంటూ చెప్పాడు చిరాగ్. ‘ఆయనకు లవర్ ఉంది. ఆమె ఎవరో కాదు స్టార్ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ డాటర్’ అంటూ సూరి చెప్పడంతో నెటిజన్లు షాక్ కు గురయ్యారు. గిల్ అదృష్ట వంతుడని, ప్రపంచ క్రికెట్ కే దేవుడిగా కొలుస్తున్న సచిన్ ఇంటికి అల్లుడిగా వెళ్తున్నాడని ఆయన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.