Sachin Daughter Marriage : సచిన్ కూతురు పెళ్లి ఆ యంగ్ క్రికెటర్ తోనేనా.. ఎవరంటే?

Sachin Daughter Marriage, Sara Tendulkar
Sachin Daughter Marriage : నెట్టింట సెలెబ్రిటీల పెళ్లిళ్లు, లవ్ ఎఫైర్స్ వంటి ఎన్నో వార్తలు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.. ఇలాంటి వార్తలకు నెటిజెన్స్ లో కూడా ఆసక్తి ఉంటుంది.. అందుకే ఎక్కువుగా సెలెబ్రిటీల పర్సనల్ విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.. మరి తాజాగా మరొక సెలెబ్రిటీ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ గురించి ఇప్పుడు వార్త వైరల్ అయ్యింది.. ఈ స్టార్ డాటర్ అందరికి పరిచయమే.. కొద్దీ రోజులుగా టెండూల్కర్ డాటర్ సారా టెండూల్కర్ టీమ్ ఇండియా ఓపెనర్ శుభమన్ గిల్ తో లవ్ లో ఉందని.. ఈ యంగ్ జోడీ పెళ్లి కూడా చేసుకో బోతున్నారని వార్తలు తహరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం విదితమే..
అయితే నెటిజెన్స్ ఒక అడుగు ముందుకు వేసి వీరికి పెళ్లి చేసి మరీ పెళ్లి వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా నిజంగానే వీరు పెళ్లి చేసుకున్నారని చాలా మంది అనుకుంటున్నారు. అంతేకాదు వీరికి సంబంధించిన వీడియోలు ఏదో ఒకటి నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి..

Sara Tendulkar Family
శుభమన్ గిల్ సెంచరీ కొట్టిన సమయంలో ఈ భామ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది. వీరు నిజంగానే డేటింగ్ లో ఉన్నట్టు ఎప్పటి నుండో వార్తలు వస్తుండగా వీటిని నిజం చేస్తూ తాజాగా క్రికెటర్ చిరాగ్ చేసిన వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. నెక్స్ట్ పెళ్లి చేసుకోబోయే క్రికెటర్ ఎవరు అని అడుగగా యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ అని చెప్పాడు.
ఆయన అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఒక లవర్ కూడా ఉందని చెప్పాడు.. ఆమె పేరు సారా అని క్రికెటర్ సచిన్ కూతురే అని ఈయన స్వయంగా చెప్పడంతో ఎన్నో రోజుల నుండి వస్తున్న వార్తలకు చెక్ పడింది. మొత్తానికి లవర్ రూమర్స్ ను కట్టి పెట్టి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉందంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.