Captain Gill : ఇండియా టి20 వరల్డ్ కప్ గెలిచి ఊపు మీద ఉన్న సమయంలో జింబాబ్వే పర్యటనకు యువ టీం వెళ్లింది. అక్కడ 5 t20 ల మ్యాచులు ఆడింది. అయితే మొదటి టి20 మ్యాచ్ లో కేవలం 115 పరుగులు టార్గెట్ ను చేదించలేక కుప్పకూలి ఘోర ఓటమిని చవిచూసింది. అందరూ టి20 గెలిచిన సంబరాలు చేసుకుంటుంటే గిల్ సేన మొదటి టి20 లో జింబాబ్వే పై ఓడిపోయి భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కాగా ఈ సిరీస్ లో ముఖేష్ కుమార్ బౌలింగ్ లో మంచి పర్ఫామెన్స్ కనబరిచాడు.
బ్యాటింగ్లో శుభమన్ గిల్ 5 t20 లో కేవలం 170 పరుగులు మాత్రమే చేశాడు. అయితే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ లోని మెంబర్ అయిన మాజీ క్రికెటర్ వికెట్ కీపర్ సభా కరీం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గిల్ కెప్టెన్ గా రాణించినప్పటికీ బ్యాటర్ గా మాత్రం ఇంకా బాగా పర్ఫామెన్స్ చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. గిల్ పైన ఇంకా ఎక్కువ ఓప్స్ పెట్టుకున్నట్టు చెప్పాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టి 20 మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
రోహిత్ తో పాటే స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా జింబాబ్వేతో ఐదు టి20 ల సిరీస్లో గిల్ కు కెప్టెన్సీ అప్పగించారు. అయితే బ్యాటర్ గా మాత్రం అంత పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు కెప్టెన్ గిల్. యశస్వి జైస్వాల్ సిరీస్ మధ్యలో జాయిన్ అయినా మూడు మ్యాచుల్లోనే 142 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. గత టి20 వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడేందుకు ఛాన్స్ రాని యశస్వి జైస్వాల్ ఇక్కడ జింబాబ్వేతో వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల అందిపుచ్చుకున్నాడు. మరి సెలెక్టర్ వ్యాఖ్యలు కెప్టెన్ శుభమన్ గిల్ కు ఎలాంటి పరిస్థితులను తెచ్చిపెడుతుందోనని అందరూ చర్చించుకుంటున్నారు.