Rythu Bandhu : రైతులకు డబ్బులు.. బీఆర్ఎస్ కు ఓట్లు
Rythu Bandhu : తెలంగాణ ప్రభుత్వం అందించే రైతుబంధు పథకం డబ్బులు పంపిణీ చేసేందుకు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపడంతో రేపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. ఇలా డబ్బులు వేయడం వల్ల అధికార పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు చెబుతున్నా ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు రైతుల అకౌంట్లలోకి డబ్బులు పడనున్నాయి.
యాసంగి సీజన్ కోసం 70 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇది ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రయోజనకరంగా మారనుందని అంటున్నారు. కానీ ఎన్నికల సంఘం ఓకే చెప్పడంతో రైతుబంధు సాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బీఆర్ఎస్ కు రైతుబంధు అనుకూలంగా ఉండనుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
రైతుల ఖాతాల్లోకి డబ్బులు అధికార పార్టీకి ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు. ఈనేపథ్యంలో రైతుబంధు పథకం బీఆర్ఎస్ కు ప్లస్ కానుందని చెబుతున్నారు. కానీ ప్రజలు అంత తేలిగ్గా ఉండరని ఇప్పటికే నిర్ణయించుకున్నప్రకారమే ఓట్లు వేస్తారని ఇతర పార్టీలు భావిస్తున్నాయి. రైతుబంధు సాయం ఓటర్ల మనసు మార్చడం అంత సులభం కాదని తెలుస్తోంది.
25,26,27 తేదీల్లో సెలవులు రావడంతో 28న ఒక రోజే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసేందుకు అవకాశం ఏర్పడింది. దీంతో రేపే రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. 29,30 తేదీల్లో కూడా రైతుబంధు వేసేందుకు ఎన్నికల సంఘం నో చెప్పడంతో రేపు ఒక రోజే రైతుబంధు నిధులు పడనున్నాయని చెబుతున్నారు.