Indian cinema : భారతీయ సినిమాపై రష్యా అధ్యక్షుడి కామెంట్స్.. ఏమన్నాడంటే?
Indian cinema : భారతీయ సినిమాల కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపిస్తున్నాయనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. రష్యాలో భారతదేశానికి చెందిన చాలా సినిమాలు డబ్ చేసి ప్రదర్శించారు. భారతీయులు అన్నా.. భారత కల్చర్ అన్నా రష్యన్లకు ఎక్కువ మక్కువనట. అందుకే ప్రపంచం మొత్తం ఏ దిక్కుకు వెళ్లినా రష్యామాత్రం భారత్ తోనే కలిసి ఉంటుంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతీయ సినిమాలను ప్రశంసించారు. రష్యాలో భారతీయ చిత్రాల పంపిణీని పెంచాలనే లక్ష్యంతోనే రాబోయే చర్చలు ఉంటాయని ఆయన తెలిపారు.
రష్యాలో భారతీయ సినిమా విస్తృత ఆకర్షణ గురించి మాట్లాడుతూ, పుతిన్ రష్యా, భారత్ మధ్య లోతైన సంస్కృతిక సంబంధాలను ఎత్తిచూపారు. రష్యన్ ప్రేక్షకుల్లో భారతీయ చిత్రాలకు శాశ్వతమైన ఆదరణ ఉందని చెప్పారు. ‘BRICS సభ్య దేశాల పరంగా, భారతీయ చలనచిత్రాలు ఇక్కడ అత్యంత ప్రజాదరణ పొందాయి. భారతీయ సినిమాలను 24 గంటలూ ప్రసారం చేసే ప్రత్యేక టీవీ ఛానెల్ కూడా మా వద్ద ఉంది’ అని పుతిన్ రష్యాలో భారతీయ సినిమా పట్ల ఉన్న ఉత్సాహాన్ని నొక్కి చెప్పారు.