Hardeep Singh Puri : రష్యా ముడి చమురు తక్కువ ధరకే: హర్దీప్ సింగ్ పురి
Hardeep Singh Puri : రష్యా ముడిచమురు తక్కువ ధరకే లభిస్తోందని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. దీంతో రష్యన్ కంపెనీల నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా రష్యా ముడిచమురు దిగుమతులపూ పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో రష్యా తక్కువ ధరకు క్రూడాయిల్ విక్రయిస్తోంది. పశ్చిమ దేశాలపై ఆంక్షల వేళ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై తాజాగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల ప్రపంచానికి మేలు చేశామని చెప్పారు. అలా చేయకపోయి ఉంటే చమురు ధర మరింత పెరిగేదన్నారు.
ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్-రష్యాల మధ్య నెలకొన్న భౌగోళిక అనిశ్చితుల వల్ల యూరప్ దేశాలు రష్యా క్రూడ్ దిగుమతిపై ఆంక్షలు విధించాయి. దాంతో రష్యా చమురు ధరను తగ్గించడంతో పాటు రూపాయిల్లో ట్రేడ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఇతర దేశాల నుంచి పోలీస్తే రష్యా చమురు దిగుమతి భారత్ కు కలిసివచ్చింది. చైనా కూడా రష్యా చమురు వాడకాన్ని పెంచింది.