JAISW News Telugu

Nuclear Missiles : అణు క్షిపణులను పరీక్షించిన రష్యా

Nuclear Missiles

Nuclear Missiles

Nuclear Missiles : పుతిన్ ఆదేశాలతో రష్యా సైనిక అధికారులు అణు క్షిపణులను పరీక్షించడం ప్రారంభించారు. సైనిక అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో కమ్ చట్కా ద్వీపకల్పంలోని కురా టెస్టింగ్ రేంజ్ లోని ప్లెసెట్స్క్ లాంచ్ ప్యాడ్ నుంచి యార్స్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)ని సైన్యం పరీక్షించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. అన్ని క్షిపణులు తమ లక్ష్యాలను ధ్వంసం చేశాయని వెల్లడించింది.

గత నెలలో అమెరికా సహా నాటో  మిత్ర దేశాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. రష్యాపై దాడులు చేసేందుకు పాశ్చాత్య దేశాలు ఇచ్చిన లాంగ్ రేంజ్ ఆయుధాలను ఉక్రెయిన్ ప్రయోగిస్తే, రష్యాపై నాటో యుద్ధం ప్రారంభించినట్లుగా భావించాల్సి వస్తుందని పుతిన్ పేర్కొన్నారు. మరోపక్క, రష్యా అణ్వస్త్ర ప్రయోగాలతో నాటో అప్రమత్తమైంది.

Exit mobile version