Abhishek Sharma : అభిషేక్ శర్మ భారత క్రికెట్ లో యువ సంచలనం. తాజాగా జింబాబ్వే తో సిరీస్ కు అభిషేక్ శర్మ ను సెలెక్ట్ చేశారు. జింబాబ్వే తో సిరీస్ కు అభిషేక్ శర్మతో పాటు, యువ క్రికెటర్లు రియాన్ పరాగ్, హర్షిత్ రాణాలను కూడా సెలెక్ట్ చేశారు. అయితే మొదటి మ్యాచ్ లో అభిషేక్ శర్మకు అవకాశం రాగా.. నాలుగు బంతులాడి ఒక్క పరుగు కూడా చేయకుండా వెనుదిరిగాడు.
అభిషేక్ శర్మ రెండో మ్యాచ్ లో మాత్రం తన జూలు విదిల్చాడు. కేవలం 46 బంతుల్లోనే 8 సిక్సులు, 7 ఫోర్ల సాయంతో సెంచరీ చేశాడు. ఇందులో రెండో అర్ధ సెంచరీ కేవలం 13 బంతుల్లోనే చేయడం విశేషం. అభిషేక్ శర్మ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 200 పైగా ఉంది. గత ఆరు నెలల నుంచి అభిషేక్ శర్మ టీ 20 మ్యాచుల్లో చెలరేగి ఆడుతున్నాడు. కేవలం 18 మ్యాచుల్లోనే 200 పైగా స్ట్రైక్ రేట్ తో మొత్తం 584 పరుగులు చేశాడు.
ఈ స్ట్రైక్ రేట్ ను ఇప్పటి వరకు రసెల్, హెడ్, జేమ్స్ ప్రెజర్ మెక్ గుర్క్ కూడా అధిగమించలేరు. అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 200 కాగా.. రసెల్ 194.47, జేమ్స్ ఫ్రెజర్ మెక్ గుర్క్ 194.17 గా ఉంది. వీరి కంటే ట్రావిస్ హెడ్ (176.) పిల్ సాల్ట్ ( 172) గా ఉంది.
అభిషేక్ శర్మ విధ్వంసం చూసిన ప్రతి ఒక్కరూ రోహిత్ శర్మకు ధీటుగా ఆడే ప్లేయర్ దొరికేశాడని ఇక టీ 20 మ్యాచుల్లో ఓపెనర్ కొరత తీరినట్లే అని క్రికెట్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అభిషేక్ శర్మ బాగా ఆడి మంచి ఫర్మామెన్స్ కనబర్చి టీం ఇండియాలో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.