Aadhaar : ‘ఆధార్’పై రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన ‘ఉడాయ్’

Aadhaar

Aadhaar

Aadhaar : ఆధార్ పై సోషల్ మీడియాలో ఇటీవల ఒక చర్చ విస్తృతంగా జరుగుతోంది. జూన్ 14 లోపు తమ వ్యక్తిగత వివరాలు అప్ డేట్ చేయనివారి ఆధార్ పనిచేయదంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లను నమ్మవద్దంటూ భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికారిక సంస్థ (ఉడాయ్) తెలిపింది.

ఆధార్ లో కేవలం ఉచితంగా వివరాలు అప్ డేట్ చేసుకోవడానికి మాత్రమే జూన్ 14 చివరి తేదీ అని తెలిపింది. వివరాలు అప్ డేట్ చేయకపోయినా ఆధార్ కార్డు పనిచేస్తుందని స్పష్టం చేసింది. అయితే, ఆ తర్వాత ఆధార్ కేంద్రాలకు వెళ్లి ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుందని వివరించింది.

కాగా, ఉచితంగా ఆన్ లైన్ లో ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకునేందుకు ఉడాయ్ తొలుత 2023 డిసెంబర్ 14 వరకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ఈ గడువును రెండు సార్లు జూన్ 14 వరకు పొడిగించింది. ఈ లోపు ఆన్ లైన్ లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్ డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు వివరాలను అప్ డేట్ చేసుకోవాలని ఉడాయ్ గతంలో సూచించింది.

TAGS