Bunny-Sukku : బన్నీ-సుక్కులను వీడని రూమర్లు..
Bunny-Sukku : ప్రస్తుతం ఇండియన్ సిల్కర్ స్ర్కీన్ పై సీక్వెల్ ల సందడి కొనసాగుతుంది. బాహుబలి, కేజీఎఫ్ తర్వాత పాన్ ఇండియాలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్ చిత్రాల్లో అల్లు అర్జున్ పుష్ప-2 మొదటి స్థానంలో ఉన్నది. పుష్ప దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించడంతో పార్ట్-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో పుష్ప టీమ్ పై చాలా ఒత్తిడి ఉంది. అయితే అంతర్గతంగా పలు మార్పులు చేసినట్లుగా టాక్ వినిపిస్తున్నది. పుష్ప 2 తో పాటు పుష్ప-3 కి సుకుమార్ ప్లాన్ చేసినట్లు తెలుస్తున్నది. కానీ తాను అనుకున్న కథని పూర్తిగా మార్చేసినట్లు సమాచారం. దీంతో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ మధ్య గొడవలు జరిగాయని.. వివాదంగా మరింత ముదరడంతో సినిమా ఆలస్యం అవుతూ వస్తున్నదనే పుకార్లు వినిపిస్తున్నాయి.
అప్పటికప్పుడు చేస్తున్న మార్పులతో సినిమా యూనిట్ కూడా గందరగోళానికి గురవుతున్నదనే టాక్ వినిపిస్తున్నది. దీంతో పుష్ప 2 మరోసారి వాయిదా పడిందనే రూమర్లు స్ర్పెడ్ అవుతున్నాయి. ముందుగా అనుకున్న ఆగస్టు 15 నుంచి డిసెంబర్6 కి వాయిదా వేసిన పుష్ప-2 ను మరోతేదీకి వాయిదా వేసినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ కు పుష్ప-2 షిఫ్ట్ అయ్యిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ లో మరో రెండు భారీ సినిమాలు ఉండడతో పోటీ లేకుండా చూసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
డిసెంబర్ లో పుష్ప 2 రిలీజ్ చేస్తే రామ్ చరణ్ గేమ్ చేంజర్, విష్ణు కన్నప్ప సినిమాల కారణంగా కలెక్షన్లపై ప్రభావం పడుతుందని నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారని మరో టాక్. అయితే వీటిలో ఏది నిజమో, ఏదీ అబద్ధమో అంతు చిక్కడం లేదు. ఏప్రిల్ లో విడుదలపై మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటి దాకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అసలు బన్నీ-సుక్కుల మీద ఈ రూమర్స్ ఎందుకు వస్తున్నాయో తెలియకపోవడంతో అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు.