RTC bus Accident : అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన ప్రకారం.. కుట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు ఆటోలో గార్లదిన్నెకు పని కోసం వచ్చారు. తిరిగి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. రాంజమనమ్మ, బాల గద్దయ్యలు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో డి.నాగమ్మ, నాగమ్మ ప్రాణాలు కోల్పోయారు. గాయాలైన వారిని ఆనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ, డీఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఆర్టీసీ డ్రైవర్ ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.