RS Praveen : పరిటాల హత్య వెనుక ఆర్ఎస్ ప్రవీణ్..
RS Praveen : ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత సంచలనం సృష్టించిన ఘటనల్లో పరిటాల రవీంద్ర అలియాస్ రవి హత్య ఒకటి. 2005, జనవరి 5వ తేదీన ఆయన హత్య విషయం విన్న సొంత జిల్లా అనంతపూరే కాకుండా యాతవ్ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెలుగుదేశం పార్టీలో కీలక నేత, అనంతపూర్ జిల్లాలో జనాధరణ కలిగిన వ్యక్తి కావడంతో ప్రతీ ఒక్కరి దృష్టిని ఈ హత్య ఆకర్షించింది. దాదాపు తొమ్మిది నెలలు ఈ హత్యకు సంబంధించిన విషయాలే టీవీలు, పేపర్లలో ప్రచారం అయ్యాయంటే ఆ నాయకుడికి ఎంత ఆదరణ ఉందో ఇట్టే అర్థం అవుతుంది.
ఈ హత్యకు సంబంధించి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా నిరసన గళం రావడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించింది. ప్రధాన వ్యక్తి మొద్దు శీను, భాను అని వారిని అరెస్ట్ చేశారు. కానీ ఊహించని రీతిలో మొద్దు శీను జైలులు హత్యకు గురయ్యాడు. ఇప్పటికీ ఈ కేసు కొలిక్కి రాలేదు. ఈ కేసులో ఇప్పుడు ఒక పేరు వినిస్తుంది. ఒక టీవీ డెబిట్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన దీనికి వివరణ కూడా ఇచ్చాడు. ఆయనే రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దీనిపై ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు.
అప్పుడు ఏం జరిగిందంటే?
తన తండ్రిని చంపినవారిని వారిని చంపాలని ఫ్యాక్షన్ లోకి దిగిన పరిటాల రవీంద్ర అలీయాస్ రవి అనంతపురం జిల్లాలో పెద్ద ఫ్యాక్షనిస్ట్ గా అవతారం ఎత్తాడు. దీంతో జిల్లాలో ఆయనకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. అనంతపురంలో కాంగ్రెస్ ను కట్టడి చేసేందుకు టీడీపీ అధినే యన్టీఆర్ పరిటాలను రంగంలోకి దింపాడు. ఆయన కూడా అత్యధిక మెజార్టీతో గెలుపొందాడు. అప్పటి నుంచి ఆయన జిల్లాలో, తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పడం ప్రారంభించాడు.
ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఆయనకు థ్రెట్ కూడా ఎక్కువగానే ఉంది. దీంతో తనకు భద్రతను కల్పించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరాడు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆయన హత్య తర్వాత ఆ నిందను కాంగ్రెస్ ప్రభుత్వం మోయాల్సి వచ్చింది. ఈ హత్యకు సంబందించి ముందే మీకు తెలుసు అన్నట్లు ఒక వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ ను ప్రశ్నించాడు. అయితే దీనికి ఆయన ‘ఎస్’ అని చెప్పారు.
ఆర్ఎస్ ప్రవీణ్ ఏం చేశాడు?
ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పరిటాల రవి హత్య కుట్రపై అడిన ప్రశ్నకు ఆర్ఎస్ స్పందిస్తూ.. ‘పరిటాల హత్యకు సంబంధించి ప్రభుత్వం సీబీఐ ఎంక్వయిరీకి ఆదేశించింది. సుదీర్ఘ కాలం ఎంక్వైరీ సాగింది. కానీ ఒక్క చోటా నా పేరు లేదు. హత్యకు సంబంధించి చాలా మంది నాయకులపై చిదంబరంపై కూడా విచారణ జరిగింది. కానీ నాపై కాదు గదా.. నా పేరు కూడా ఎక్కడా వినిపించలేదు.’ అని ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పాడు.
అయితే, ‘హత్య కుట్ర గురించి మీకు తెలుసా అంటే తెలుసు. నాడు చర్లపల్లి జైలులో పరిటాల హత్యకు సంబంధించి కుట్ర జరుగుతుందని చెప్పింది నేనే. దీనికి సంబంధించి డీజీపీకి కూడా లేఖ రాశాను ఆ సమయంలో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.’ అని ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పారు. అయితే ఆయన హత్య వెనుక పెద్ద తలలు ఉన్నాయని అంతా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ పేరు వినిపించడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది.