rubber balloons : తమిళనాడులో రోడ్ల మీద రబ్బరు బెలూన్లను అమ్ముకునే వ్యక్తి 53వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యన్ని నిర్మించారు. ఎంఆర్ఎఫ్ మొదట రబ్బరు కంపెనీగా స్థాపించబడింది. అది తరువాత విస్తరించింది. ఎంఆర్ఎఫ్ తిరువొత్తియూర్ మద్రాస్ (ప్రస్తుతం చెన్నై)లో బొమ్మల బెలూన్ తయారీ యూనిట్‌గా ప్రారంభమైంది. దీనిని 1946లో కేఎం మమ్మెన్ మాప్పిళ్లై ప్రారంభించారు. దీని తరువాత, 1952లో కంపెనీ వాణిజ్య రబ్బరు తయారీని ప్రారంభించింది. మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ నవంబర్ 1960లో ప్రైవేట్ కంపెనీగా స్థాపించబడింది. దీని తరువాత, అమెరికాలోని ఓహియోకు చెందిన మాన్స్‌ఫీల్డ్ టైర్, రబ్బర్ కంపెనీ భాగస్వామ్యంతో టైర్ల తయారీలో జాయింట్ వెంచర్ చేయబడింది. కంపెనీ 1 ఏప్రిల్ 1961న పబ్లిక్ లిమిటెడ్‌గా మారింది. అదే ఏడాది అంటే 1961లో అప్పటి తమిళనాడు సీఎం ఎంఆర్‌ఎఫ్ ప్లాంట్ నుంచి తొలి టైర్‌ను బయటకు తీశారు. కొన్ని సంవత్సరాలలో, 1967లో అమెరికాకు టైర్లను ఎగుమతి చేసిన మొదటి భారతీయ కంపెనీగా ఎంఆర్ఎఫ్ అవతరించింది.