JAISW News Telugu

CM Chandrababu : బెల్టులకు మద్యం సరఫరా చేస్తే రూ.5 లక్షలు జరిమానా: సీఎం చంద్రబాబు

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu : బెల్టులకు మద్యం సరఫరా చేస్తే రూ.5 లక్షలు మొదటిసారి జరిమానా విధించాలని, రెండోసారి ఉల్లంఘనకు పాల్పడితే లైసెన్స్ రద్దు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మద్యం, ఇసుకపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘బెల్టు షాపులు ఎక్కడా ఉండకూడదు. బెల్టులకు మద్యం సరఫరా చేసే లైసెన్సీలకు మొదటిసారి రూ.5 లక్షలు జరిమానా విధించాలి. రెండోసారి పట్టుబడితే లైసెన్స్ రద్దు చేయాలి. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై కఠినంగా వ్యవహరించాలి. ప్రతి మద్యం షాపులో సీసీ కెమెరాలు ఉండాలి. ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలి. షాపులో ధరల పట్టిక ప్రదర్శించాలి. అలాగే ఇసుక పొరుగు రాష్ట్రాలకు ఒక్క లారీ వెళ్లకూడదు. ఇసుకలో ఎక్కడైనా అక్రమాలు జరిగితే సంబంధిత అధికారులే తొలి బాధ్యులు అవుతారు’ అని అన్నారు.
Exit mobile version