Hyderabad : హైదరాబాద్ లో బతకాలంటే నెలకు రూ.31వేలు

Hyderabad
Hyderabad : హైదరాబాద్ నగరంలో జీవన వ్యయం రోజురోజుకూ పెరుగుతోంది. సామాన్యులకు ఇక్కడ బతకడం కష్టతరంగా మారుతోంది. తాజాగా వెల్లడైన నివేదికల ప్రకారం, నగరంలో ఒక సింగిల్ రూమ్ అద్దె కూడా దాదాపు రూ. 8,000 పలుకుతోంది. ఇది కేవలం ఇంటి అద్దె మాత్రమే.
నెలకు అవసరమయ్యే నిత్యావసర సరుకులు, పిల్లల స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులు వంటివి దీనికి అదనం. ఇన్ఫోమెరిక్స్ ఆన్‌లైన్ మీడియా స్టార్టప్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్ నిర్వహించిన సర్వే ప్రకారం, హైదరాబాద్‌లో ఒక వ్యక్తి నెలవారీ ఖర్చులు సుమారు రూ. 31,253గా ఉన్నాయి. ఇందులో ఇంటి అద్దె, ఇతర సామాన్లు మరియు రవాణా ఖర్చులు కూడా కలిసి ఉన్నాయి.
లక్షలాది మంది ఇక్కడ కేవలం రూ. 15,000 వేతనంతో పనిచేస్తున్నారని నివేదిక పేర్కొంది. ఈ పెరుగుతున్న ఖర్చులతో వారి జీతం ఏమాత్రం సరిపోవడం లేదు.
ఈ సర్వే దేశంలోని 10 ప్రధాన నగరాల్లో నిర్వహించగా, జీవన వ్యయం పరంగా హైదరాబాద్ ఆరో స్థానంలో నిలిచింది. బెంగళూరు అత్యంత ఖరీదైన నగరంగా మొదటి స్థానంలో ఉండగా, జైపూర్ చివరి స్థానంలో ఉంది. దీంతో హైదరాబాద్‌లో నివసించే మధ్య తరగతి మరియు తక్కువ ఆదాయం కలిగిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.