Musi Residents : మూసీ నిర్వాసితులకు రూ.25 వేల ప్రోత్సాహకం
Musi Residents : మూసీ నిర్వాసితులకు రెండు పడక గదుల ఇల్లు ఇస్తున్న చోటుకు వెళ్లే వారికి రూ.25 వేల ప్రోత్సాహకం అందించనుంది. ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడే రెవెన్యూ అధికారులు నిర్వాసితులకు ఈ మొత్తం అందజేయనున్నారు. వారం రోజుల పాటువారికి ఉపయుక్తంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, నిర్వాసితుల్లో చాలామంది చిన్నచిన్న పనులు చేసుకునేవారు కావడంతో కొత్త ప్రదేశానికి వెళ్లడానికి సుముఖత చూపించడం లేదు. కొత్త ప్రదేశంలో పనులు దొరక్కపోవడం, చిరు వ్యాపారులు పండ్లు, కూరగాయలు విక్రయించుకోవడానికి అనువైన పరిస్థితులు ఉండకపోవడం వంటి కారణాలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నారు. వారికి సమీపంలోనే రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఇళ్లు కేటాయించాలని కోరుతున్నారు. రెవెన్యూ అధికారులు గురు, శుక్రవారాల్లో ప్రతి కుటుంబాన్ని కలిసి వారి ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు.