Heroine Trisha : మన్సూర్ అలీఖాన్, త్రిష మధ్య జరిగిన వివాదం తెలిసిందే. లియో మూవీలో త్రిషను రేప్ చేసే అవకాశం తనకు రాలేదంటూ వెటకారంగా మీడియా ముందు స్పందించాడు మన్సూర్. ఆయన వ్యాఖ్యలను చిరంజీవి లాంటి సీనియర్ ఆర్టిస్ట్ లతో పాటు తెలుగు, తమిళం ఇండస్ట్రీలోని చాలా మంది ఖండించారు. కోర్టు స్వయంగా కలుగజేసుకొని మన్సూర్ కు మొట్టికాయలు వేసింది. ఇప్పుడు దీన్ని మించిన ఘటనే మరోటి వెలుగులోకి వచ్చింది.
అన్నా డీఎంకే బహిష్కృత నేత ఏవీ రాజు నటి త్రిషపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో త్రిష గౌవత్తూరులో ఓ ఫంక్షన్ కు హాజరైంది. అక్కడి స్థానిక ఎమ్మెల్యే త్రిషపై మనసుపడ్డాడు. ఒక రోజుకు రూ. 25 లక్షలు చెల్లించి త్రిషతో గడిపాడు. దానికి నేనే సాక్ష్యం’ అంటూ చెప్పాడు.
ఏవీ రాజు చేసిన ఆరోపణలను త్రిష అభిమానులు తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం కాస్తా త్రిష వరకు చేరుకుంది. ఆమె చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. నలుగురి దృష్టి ఆకర్షించేందుకు కొందరు ఎంత నీచానికైనా దిగజారుతారని వ్యాఖ్యానించింది. రాజు చేసిన వ్యాఖ్యాలపై త్రిష తీవ్రంగా స్పందించింది. అతడిపై లీగల్ యాక్షన్ కు దిగుతానని, ఇక నుంచి దీనిపై ఏం మాట్లాడాలన్నా తన లీగల్ టీమ్ స్పందిస్తుందని స్పష్టం చేసింది.
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష. సెకెండ్ ఇన్నింగ్స్ లో ఆమె మరింత బిజీగా మారింది. విజయ్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. ఇలాంటి టైమ్ లో ఆమెపై కొందరు ఇలా పనిగట్టుకొని విమర్శలకు చేయడం. పైగా త్రిషకు ఎలాంటి పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేకపోవడం, ఆమె వెనక బలమైన వ్యక్తులు లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని అభిమానులు బాధపడుతున్నారు.