Salman Khan : సల్మాన్ ఖాన్ హత్యకు రూ.25 లక్షల సుపారీ
Salman Khan Murder : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు నిందితులు రూ.25 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నని ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా చార్జ్ షీట్ ను దాఖలు చేసిన అధికారులు సంచలన విషయాలను వెల్లడించారు. నవీ ముంబై పోలీసులు తెలిపిన ప్రకారం.. నేరస్థుడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో ఈ ఐదుగురికి సంబంధాలు ఉన్నాయని, సల్మాన్ ఖాన్ హత్యకు కుట్రతో పాటు గతంలో అనేక నేరాలకు పాల్పడినట్టు తెలిపారు.
సల్మాన్ ఖాన్ ను హత్య చేయడం కోసం బిష్ణోయ్ గ్యాంగ్ తో రూ.25 లక్షల సుపారీకి ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకొసం 2023 ఆగస్ట్ నుంచి 2024 ఏప్రిల్ వరకు ప్రణాళిక రూపొందించారు. సల్మాన్ ఖాన్ ప్రతీ కదలికను వారు గమనించారు. హత్య కోసం ఏకే-47లు, ఏకే-92లు, ఎం-16 రైఫిల్స్, టర్కిష్ తయారుచేసిన జిగానా పిస్టల్ తో సహా పాకిస్తాన్ నుండి అధునాతన తుపాకీలను కొనుగోలు చేయడానికి ప్లాన్ చేశారు. హత్య చేయడం కోసం ఉత్తర అమెరికా నుంచి ఒక మైనర్ బాలుడిని నియమించారు. ప్లాన్ అంతా పూర్తయి బిష్ణోయ్ ఆదేశాల కోసం ఆ బాలుడు ఎదురుచూస్తున్నట్లుగా పోలీసులు చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కొత్త ఛార్జ్ షీట్ సంచలనం రేపుతోంది.