Modi : చెత్త తొలగింపు ద్వారా రూ.2,364 కోట్లు : ప్రశంసించిన మోదీ
PM Modi : కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛత’ ప్రచారం ద్వారా స్క్రాప్‌ల తొలగింపును ప్రారంభించింది. ఇందులో భాగంగా కేవలం మూడేళ్లలో ప్రభుత్వం ఏకంగా 2,364 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి ‘జితేంద్ర సింగ్’ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. స్క్రాప్‌ల ద్వారా భారీ మొత్తాన్ని సేకరించేందుకు ప్రభుత్వానికి సహాయం చేసినందుకు ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్’ (డిపిఐఐటి)ని భారత ప్రధాని ‘మోడీ’ ప్రశంసించారు. జితేంద్ర సింగ్ పోస్ట్‌ను పంచుకోవడం.. ప్రశంసనీయం! సమర్థవంతమైన నిర్వహణ, క్రియాశీల చర్యపై దృష్టి పెట్టడం ద్వారా గొప్ప ఫలితాలు సాధించబడ్డాయి. పరిశుభ్రత, ఆర్థిక వివేకం రెండింటినీ ప్రోత్సహిస్తూ, సమిష్టి కృషి స్థిరమైన ఫలితాలకు ఎలా దారితీస్తుందో ఇది చూపుతుందని మోదీ అన్నారు.
స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా భౌతిక ఫైళ్లను తొలగించడం వల్ల 15,847 అడుగుల స్థలం ఖాళీ అయింది. దీని ద్వారా దాదాపు రూ. 16,39,452 ఆదాయాన్ని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫిజికల్ ఫైల్స్ ప్రతి సంవత్సరం విపరీతంగా పెరుగుతుండటంతో, కార్యాలయాలలో స్థలం కూడా నిండి ఉంటుంది. వీటన్నింటిని తొలగిస్తే ఖాళీ స్థలం ఏర్పడడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు సొమ్ము చేరుతుంది.