JAISW News Telugu

Raghu Rama Krishna Raju : ఆర్ఆర్ఆర్ ను పక్కనపెట్టారా..? ఇప్పటికైతే బీజేపీ లిస్ట్ లో ఆయన పేరు లేదు?

Raghu Rama Krishna Raju

Raghu Rama Krishna Raju

Raghu Rama Krishna Raju   : పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేయగా ఊహించినట్లుగానే కనుమూరి రఘురామకృష్ణరాజు మద్దతుదారులకు నిరాశే ఎదురైంది. ఈ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ పేరు కనిపించలేదు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ వర్మకు కేటాయించారు.

అసెంబ్లీ సెగ్మెంట్లకు పోటీ చేయాలని పార్టీ నాయకత్వం కొంత మంది సీనియర్లను కోరింది. ఎంపీ సీట్లు కావాలని అందరూ డిమాండ్ చేస్తే నాయకత్వం ఏం చేస్తుందని పార్టీ పెద్దలు నేతలను ప్రశ్నించినట్లు తెలిసింది.

బీజేపీ లోక్ సభ అభ్యర్థుల జాబితా ఇలా ఉంది.
రాజమండ్రి- పురంధేశ్వరి
అనకాపల్లి- సీఎం రమేష్
అరకు- కొత్తపల్లి గీత
రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి
తిరుపతి- వరప్రసాద్
నరసాపురం- శ్రీనివాసవర్మ (ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి)

ఈ లిస్ట్ లో షాకింగ్ విషయం ఏంటంటే.. ‘ఏపీలో నిజమైన ప్రతిపక్షం’గా గుర్తింపు తెచ్చుకున్న రఘురామకృష్ణరాజు పేరు లేకపోవడం, జగన్ కు వ్యతిరేకంగా అన్ని రకాలుగా నిలదొక్కుకోవడం, ఏపీలోకి ఆర్ఆర్ఆర్ ఎంట్రీని అడ్డుకునేందుకు ఏపీ సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, అందులో జగన్ సక్సెస్ అయ్యేలా కనిపిస్తోందని కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది.

దీనికితోడు బీజేపీ తన అసెంబ్లీ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసింది.
* ఎచ్చెర్ల: నడికుడి ఈశ్వరరావు
* విజయవాడ వెస్ట్: సుజనాచౌదరి
* ఆదోని: పరదాశరధి
* బద్వేలు: పనాల సురేష్
* పాడేరు: ఉమామహేశ్వరరావు
* జమ్మలమడుగు: ఆదినారాయణరెడ్డి
* ధర్మవరం: వరదాపురం సూరి లేదా సత్యకుమార్
** కైకలూరు: కామినేని శ్రీనివాస్ లేదా తపన చౌదరి
** వైజాగ్ నార్త్: విష్ణుకుమార్ రాజు

రాబోయే ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వ్యూహం, పొత్తులను ఈ ఎంపికలు హైలైట్ చేస్తున్నాయి.

Exit mobile version