JAISW News Telugu

RRR : ఆర్ఆర్ఆర్.. వాయింపు మొదలెట్టేసాడుగా..!!

RRR

RRR

RRR : 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా విజయం సాధించి తక్కువ సమయంలోనే తిరుగుబాటు చేసిన రఘురామ కృష్ణరాజు ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీ రెబల్ ఎంపీగా ఆయన చేసిన తిరుగుబాటు టీడీపీకి మంచి స్టఫ్ అందించింది. జగన్ అంటేనే ఒంటికాలిపై లేచే రఘురామ కృష్ణరాజు ఈ సారి అసెంబ్లీలో జగన్ ను ఎలా ఇరుకున పెడుతాడో అనేది పొలిటికల్ సర్కిల్ లో ఆసక్తికర అంశంగా మారింది.

వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో తనను టార్గెట్ చేసి మరీ వేధించడంతో జగన్ పై రఘురామ ఆగ్రహంతో ఉన్నారు. సమయం వచ్చినప్పుడు తేల్చుకుంటామని స్పష్టం చేయడంతో రఘురామ- జగన్ మధ్య జరిగే అసెంబ్లీ వార్ సీన్ ఎలా ఉంటుందని అందరిలో ఉత్సాహం రేకెత్తించింది. ఈ సీన్ ఎప్పుడెప్పుడా అని పాక్ – ఇండియా మ్యాచ్ కోసం ఎదురుచూస్తునట్లు ఏపీ ప్రజలు ఈగల్ గా వెయిట్ చేశారు. మొదటి రోజు అసెంబ్లీలో అలాంటి దృశ్యాలు ఆవిష్కృతం కాకపోవడంతో రెండో రోజు తమ కల నెరవేరుతుందనుకున్నా.. రెండో రోజు అసెంబ్లీకి జగన్ రాలేదు.

అయితే, సభలో రఘురామ కృష్ణరాజు మాట్లాడే అవకాశం దక్కడంతో మొదటి స్పీచ్ లోనే జగన్ ను గట్టిగా వాయించేశారు. జగన్ పై సెటైర్లు వేశారు. ‘సింహం అంటూ చెప్పుకునే వారు నిన్ననే సభకు వచ్చి వారి పేరు మర్చిపోయేలా త త త.. ప ప ప అన్నారు. ఎందుకంటే, అయ్యన్నపాత్రుడిని స్పీకర్ గా ఎన్నుకుంటున్నారన్న విషయం అప్పుడే తెలిసింది కాబట్టి.. వారి పేరు కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.’ ఈ వ్యాఖ్యలు జగన్ ను ఉద్దేశించే రఘురామ అనడంతో.. ఆర్ఆర్ఆర్ అప్పుడే మొదలు పెట్టారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రానున్న రోజుల్లో జగన్ అసెంబ్లీకి వస్తే రఘురామ కృష్ణరాజు తన సెటైర్లలో డోస్ పెంచి మరీ జగన్ ను వాయిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Exit mobile version