RR Vs KNR : బట్లర్ మ్యాజిక్ ఇన్సింగ్స్… చివరి బంతికి రాజస్థాన్ విజయం
RR Vs KNR : రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. రాజస్థాన్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ విధ్వంసం, పోరాడిన విధానం చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. 20వ ఓవర్ చివరి బంతికి 224 రన్స్ టార్గెట్ చేసి రాజస్థాన్ కు మరుపురాని విజయాన్ని అందించాడు. టాస్ కోల్పోయి మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 223 పరుగుల భారీ స్కోర్ చేసింది. సునీల్ నరైన్ 13 ఫోర్లు, 9 సిక్సుల సాయం తో 105 పరుగుల చేశాడు. కోల్ కతా బ్యాటర్లలో రఘు వంశీ 30 పరుగుల చేయగా.. సునీల్ నరైన్ భారీ సిక్సులతో చెలరేగాడు.
అనంతరం చేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ మొదట్లో సరైన ఆరంభమే దొరకలేదు. జైస్వాల్ 9 బంతుల్లో 19 పరుగులకు ఔటయ్యాడు. దీంతో వికెట్ల పతనం ప్రారంభమైంది. అయితే ఎవరూ కూడా రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందని అనుకోలేదు. ఆరుగురు ఔటయ్యాక కూడా బట్లర్ ఒంటరి పోరాటం చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఏంటీ 223 పరుగుల ఛేజింగ్ లో 121 పరుగుల కే ఆరుగురు ఔటైన గెలవడం అంటే మామూలు మాటలు కాదు.
మ్యాచ్ అనంతరం జోస్ బట్లర్ మాట్లాడుతూ.. కోచ్ సంగక్కర ఒకటే చెప్పాడు. క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నం చేయ్.. ఫలితం అదే వస్తుందని చెప్పాడు. అవకాశం కోసం ఎదురు చూడు.. ఒక్కసారి చాన్స్ దొరికితే ఇక ఈజీ అవుతుందన్నాడు. అందుకే ఒక వైపు వికెట్లు పడుతున్న మొదట స్లో గా ఆడాను. నన్ను నేనునమ్మాను. ఛేజ్ చేయడం కష్టం కాదని అనుకున్నానని చెప్పాడు.
సునీల్ నరైన్ ఆట తీరు బాగుందని భారీ స్కోరు చేసినా కూడా ఓడిపోవడం బాధగా ఉందని… బట్లర్ మాత్రమే మా విజయాన్ని అడ్డుకున్నాడని సగం మ్యాచ్ వరకు ఈజీగా గెలుస్తామనుకున్నామని కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నారు. ఐపీఎల్ కొనసాగుతున్న కొద్దీ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. రాజస్థాన్ పాయింట్స్ టేబుల్స్ లో మొదటి స్థానానికి చేరుకోగా.. కోల్ కతా రెండో స్థానంలో ఉంది.