Royal Bengal Tiger : అస్సాం నాగావ్ జిల్లాలో రాయల్ బెంగాల్ టైగర్.. భయంతో వణికిపోతున్న ప్రజలు

Royal Bengal Tiger

Royal Bengal Tiger

Royal Bengal Tiger : అస్సాం నాగావ్ జిల్లాలో రాయల్ బెంగాల్ టైగర్ సంచరిస్తుండడంతో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. భారీ వర్షాలు, వరదలతో వన్యప్రాణి అభయారణ్యం నుంచి బయటకు కొట్టుకువచ్చిన టైగర్ పొలాల్లోని ఇద్దరు రైతులపై దాడి చేసింది. దీంతో వారికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో రాయల్ బెంగాల్ టైగర్ లావోకోవాలోని బుర్హాచపోరి వన్యప్రాణి అభయారణ్యం నుంచి బయటకు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.

నాగావ్ జిల్లాలో 30 వేల మంది ప్రజలు వరదలతో ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలు, వరదల ప్రభావం వన్యప్రాణి అభయారణ్యాలపై కూడా పడింది. కజిరంగా నేషనల్ పార్కులో ఖడ్గ మృగం, పంది జింకతో సహా 17 వన్యప్రాణులు వరదలో కొట్టుకుపోయాయి. 72 వన్యప్రాణులను అటవీ అధికారులు రక్షించారు.

TAGS