Pinnelli Brothers : పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్..?

Pinnelli Brothers
Pinnelli Brothers : పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీషీట్ తెరిచినట్లు తెలిసింది. అయితే, ఇందుకు సంబంధించిన వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించడం లేదు.
ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగింది. పోలింగ్ కొనసాగుతుండగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెంటచింత మండలం పాల్వాయిగేటు గ్రామంలోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావుపై అనుచరులతో దాడి చేయించారు. ఈ ఘటనకు సంబంధించి ఆయనపై కేసులు నమోదు కాగా, ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. తాజాగా, పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్ తెరిచినట్టు తెలిసింది.
TAGS Ex MLA Pinnelli Ramakrishna ReddyPalnadu DistrictPinelli damaged EVMPinnelli BrothersPinnelli Brothers RowdysheetPinnelli VenkataramireddyRowdy Sheet caseYCP MLA Pinnelli