OTT Movies : ఆంటీతో రొమాన్స్.. ఒంటరిగా చూడాలి.. ఎక్కడంటే?
OTT Movies : కాలం రాను రాను మారుతూ వస్తోంది. కాలంతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా మారుతోంది. గతంలో డ్రామా, యాక్షన్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడే వారు ఇప్పుడు మర్డర్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. దీంతో సినిమా టైటిల్ తో సంబంధం లేకుండా కథ నడుస్తోంది.
ఇటీవలి కాలంలో మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సమాజంలో యువతుల లాగానే యువకులు కూడా అనేక సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ప్రేమ, బ్రేకప్, డేటింగ్ అంటూ జీవితాలు నరకంగా మార్చుకుంటున్నారు. తమ జీవితంలో కష్టాలను ఎవరికీ చెప్పుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమానే బీఏ పాస్ (BA Pass). ఒక పంజాబీ కుటుంబంలో జరిగిన యధార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
అనుకోని ప్రమాదంలో ఆ ఫ్యామిలీలోని భార్యా, భర్తలు చనిపోవడంతో కుమారుడు ముఖేష్, ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మారతారు. దీంతో ఆ ముగ్గురు పిల్లలు తాతయ్య, అత్తయ్య ఇంట్లో ఉంటారు. అమ్మాయిల బాధ్యత తాత తీసుకుంటే అబ్బాయిల బాధ్యత అత్త తీసుకుంది. దీంతో ఆ కుర్రాడిని చిన్న చూపు చూస్తూ ఇంట్లో పనులు చేయించేది.
అదే సమయంలో ఆ ఇంటికి వచ్చిన ఆ అత్త స్నేహితురాలైన రేవతి ముఖేష్ పై కన్నేసి అతడిని శారీరంగా వేధిస్తుంది. దీంతో ముఖేష్ తన బాధ ఎవరికీ చెప్పుకోలేక మానసిక సంఘర్షణ అనుభవిస్తుంటాడు. ప్రశాంతత కోసం శ్మశానానికి వెళ్లగా.. అక్కడ ముఖేష్ కు ఓ వ్యక్తి పరిచయమవడం, ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. మరో వైపు తాత మరణించడంతో చెల్లెళ్ల బాధ్యత కూడా ముఖేష్ పై పడుతుంది. దీంతో వారిని చైసుకునేందుకు డబ్బు కావాలి కదా.. అందుకు రేవతి ఆంటీతో ప్రేమాయణం కొనసాగిస్తాడు. ఇక, ఆమె ముఖేష్ ను అమ్మాయిల వద్దకు పంపుతూ డబ్బు సంపాదిస్తుంది.
ముఖేష్ తన చెల్లెళ్లను హాస్టల్లో చేర్పించి చదివిస్తుంటాడు. ఇదే హాస్టల్ కు చెందిన ఓనర్ అమ్మాయిలను విక్రయిస్తుంటుంది. దీంతో తన చెల్లెళ్లను కాపాడుకునేందుకు ఆ ఓనర్ కు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తాడు. అక్కడే ముఖేష్ కు కొందరు అమ్మాయిలతో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత అతడి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాలి. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంది.