JAISW News Telugu

Romance : హైదరాబాద్ లో రద్దీ రోడ్డులో బైక్ పై రొమాన్స్.. వీడియో..

Romance on Bike : ప్రేమ పేరుతో జంటలు బరితెగిస్తున్నాయని అనడంలో ఎలాంటి సందేహం లేదని ఈ వీడియో చెప్తోంది. హైదరాబాద్ అంటేనే రద్దీగా ఉండే రోడ్లు ట్రాఫిక్ జామ్ లు. ఇలాంటి రోడ్లపై ఒంటరిగా పోవడమే గగనం. ఇక దంపతులైతే మరింత కష్టంగా ప్రయాణం చేయాలి. కానీ ఒక ప్రేమ జంట మాత్రం రొమాన్స్ చేస్తూ చెక్కర్లు కొట్టింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగర శివారులోని శ్రీశైలం రహదారిపై జంట ఇష్టారీతిన సంచరించింది. ప్రేమ జంటలో యువకుడు బైక్ నడుపుతుండగా.. యువతి ముందు నుంచి యువకుడికి ఆపోజిట్ గా (బైక్ పెట్రోల్ ట్యాంక్ పై) కూర్చుంది.

ఇలా కూర్చున్న ఈ జంట బైక్ నడుపుతున్నంత సేపు రొమాన్స్ చేసుకుంటుంది. ఎదురెదురుగా బైక్ పై కూర్చొని యువకుడిని యువతి గట్టిగా హత్తుకొని యువకుడికి యువతి ముద్దులు పెడుతుంది. దీన్ని సమీపంలో నుంచి ప్రయాణం చేస్తున్న ఒక వాహనదారుడు వీడియో తీశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో నెటిజన్ల నుంచి తీవ్రమైన ఆగ్రహం కనిపించింది. అసలే కిక్కిరిసన రోడ్లు (ఆ సమయంలో కొంత ట్రాఫిక్ తక్కువగా ఉంది) ఆపై ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో ప్రయాణం చేస్తే జాగ్రత్తలు తీసుకోవాలని, అయినా, జనాల్లో బైక్ పై పట్ట పగటీలి ఇలాంటి రొమాన్స్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఒక యువకుడు ట్విటర్ లో పోలీసులను ప్రశ్నించాడు.

ఈ వీడియోను చూసిన పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేసుకున్నారు. నెంబర్ ప్లేట్ ఆధారంగా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని గుర్తించి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇస్తామని సదరు వ్యక్తికి ఎక్స్ లో పోలీసులు రిప్లయ్ ఇచ్చారు. ఇది వారికే కాదు.. తోటి వాహనదారులకు కూడా ఇబ్బంది కలిగించేదని పలువురు మండి పడుతున్నారు.
<

Exit mobile version