JAISW News Telugu

Rohith Sharma : 0.45 సెకన్లలో డేంజరస్ ప్లేయర్ ను మడతపెట్టేసిన రోహిత్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

Rohit who folded the dangerous player in 0.45 seconds.

Rohit who folded the dangerous player

Rohith Sharma : విశాఖలో జరుగుతున్న భారత్ , ఇంగ్లండ్ రెండో మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ పై 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టెస్ట్ లో భారత యువ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్ (209), గిల్ (104) పరుగులతో సత్తా చాటారు. ఈ మ్యాచ్ లో బుమ్రా 9 వికెట్లు తీసి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు.

రెండో టెస్ట్ నాలుగో రోజు భారత జట్టులో రవిచంద్రన్ అశ్విన్ పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. మూడో రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్ తీసినా అశ్విన్ ఇవాళ ఆట ప్రారంభంలోనే రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ ను పెద్ద దెబ్బ తీశాడు. స్లిప్ లో అశ్విన్ వేసిన బంతికి అప్రమత్తమైన కెప్టెన్ రోహిత్ శర్మ ఓలీ పోప్ క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ ను పట్టడానికి రోహిత్ కు అర సెకన్ కంటే తక్కువ సమయం పట్టడం విశేషం. రోహిత్ క్యాచ్ పట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పోప్ 29వ ఓవర్ లో రెండో బంతిని కట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఫస్ట్ స్లిప్ లో రోహిత్ శర్మ నిలిచాడు. అయితే బంతి ఎడమవైపు బ్యాట్ ఎడ్జ్ కు తాకింది. కెప్టెన్ రోహిత్ తన ఎడమ చేతిని ముందుకు కదిలించి రెప్పపాటులో ఈ క్యాచ్ పట్టడం అద్భుతం. ఈ క్యాచ్ ను రోహిత్ కేవలం 0.45 సెకన్లలో పూర్తిచేశాడు. దీంతో ప్రమాదకరంగా మారిన పోప్ ఇన్నింగ్స్ ముగిసిపోయింది.  తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో పోప్ 196 పరుగులు చేసి భారత్ నుంచి విజయాన్ని లాక్కున్న సంగతి తెలిసిందే.

కాగా, రోహిత్ శర్మ ఇప్పటివరకు ఆడిన 56 టెస్టుల్లో 57 క్యాచ్ లు అందుకున్నాడు. భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక క్యాచ్ లు పట్టిన 15వ ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో 163 టెస్టుల్లో 209 క్యాచ్ ల పట్టిన రాహుల్ ద్రావిడ్ అగ్రస్థానంలో ఉన్నాడు.

Exit mobile version