Indian Police Force:పోలీస్ సినిమాలకు పెట్టింది పేరు రోహిత్ శెట్టి. కాప్ డ్రామాలతో రక్తి కట్టించే సినిమాలకు దర్శకత్వం వహించిన అతడి నుంచి ఇండియన్ పోలీస్ ఫోర్స్ త్వరలో అభిమానులను అలరించేందుకు వస్తోంది. తాజాగా టీజర్ విడుదలైంది. రోహిత్ శెట్టి కాప్ విశ్వంలో ఇది పొడిగింపు. ఈసారి OTTలో కాప్ డ్రామాను ప్లే చేయబోతున్నాడు శెట్టి. సిద్ధార్థ్ మల్హోత్రా , వివేక్ ఒబెరాయ్, శిల్పాశెట్టి లాంటి భారీ తారాగణం ఈ సిరీస్ కి ప్రధాన అస్సెట్.
ఇండియన్ పోలీస్ ఫోర్స్ టీజర్ ఆద్యంతం భారీ యాక్షన్, సస్పెన్స్, థ్రిల్, డ్రామాతో రక్తి కట్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు రోహిత్ శెట్టి కాప్ విశ్వం తదుపరి అధ్యాయంలోకి లీనమయ్యే టింజ్‌ని అందించింది. నగరంలో బాంబ్ బ్లాస్ట్‌ల వెనక శక్తులేమిటన్నది శోధించే ఆఫీసర్ గా మల్హోత్రా కనిపిస్తున్నాడు. ప్రతి ఫ్రేమ్‌లో టిక్కింగ్ బాంబు గడియారం ఉత్కంఠను తీవ్రతరం చేస్తుంది. ఇది చివరికి పేలుళ్లతో వేడి పెంచుతుంది.
ఈ ప్రమాదం నేపథ్యంలో పోలీస్ డ్రామా ఏమిటన్నది తెరపైనే చూడాలి. డేరింగ్ కాప్ సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్, శిల్పాశెట్టి కుంద్రా.. బాంబు పేలుళ్ల వెనుక సూత్రధారులు బెదిరింపుల నుండి నగరాన్ని రక్షించడానికి ఎలాంటి థ్రిల్లింగ్ ఛేజింగ్ లకు పాల్పడ్డారు? అన్నది వేచి చూడాలి. గొప్ప దేశభక్తిని ఎలివేట్ చేసే సిరీస్ ఇదని చిత్రబృందం చెబుతోంది.
శిల్పా శెట్టి కుంద్రా, వివేక్ ఒబెరాయ్, శ్వేతా తివారీ, నికితిన్ ధీర్, రితురాజ్ సింగ్, లలిత్ పరిష్మో సింగ్, రితురాజ్ సింగ్ తదితరులు నటించారు. ఈ సిరీస్ కి రోహిత్ శెట్టి -సుశ్వంత్ ప్రకాష్ దర్శకత్వం వహించారు. ఏడు ఎపిసోడ్ల యాక్షన్-ప్యాక్డ్ సిరీస్ దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ పోలీసు అధికారుల నిస్వార్థ సేవ, షరతులు లేని నిబద్ధత, అసాధారణమైన దేశభక్తికి హృదయపూర్వక నివాళి. ప్రజల్ని సురక్షితంగా ఉంచడానికి పోలీసుల విధి నిర్వహణ ఎలా సాగింది? అన్నది చూడాలి. ఈ సిరీస్ 19 జనవరి 2024న ప్రైమ్ వీడియోలో ప్రదర్శితం కానుంది.