Rohit Sharma : రిటైర్ మెంట్ పై రోహిత్ శర్మ కీలక ప్రకటన

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma : టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత, భారత కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. హిట్‌మ్యాన్ వయసు పెరుగుతున్న నేపథ్యంలో 2027 ప్రపంచకప్ నాటికి అతను మిగతా రెండు ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై రోహిత్ శర్మను ప్రశ్నించగా.. అంత దూరం ఆలోచించడం లేదని సమాధాన మిచ్చాడు. తన ఆటను మరికొద్ది రోజులు అభిమానులు ఆస్వాదిస్తారని కూడా చెప్పాడు. త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ , వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో (భారత్‌కు చేరితే) రోహిత్ శర్మ టీమిండియాకు కెప్టెన్‌గా ఉంటాడని బీసీసీఐ సెక్రటరీ జే షా ఇప్పటికే ప్రకటించారు.

టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత రోహిత్ వన్డే, టెస్టు భవిష్యత్తుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జూలై 14 ఆదివారం డల్లాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో, రోహిత్‌ మిగతా ఫార్మాట్లలో రిటైర్మెంట్ పై మరోసారి అడిగారు. దీనిపై భారత కెప్టెన్ స్పందిస్తూ.. తాను చాలా దూరం ఆలోచించడం లేదన్నారు. ఇంకా చాలా మిగిలి ఉందన్నారు.  నా ఆటను మరి కొంతకాలం చూస్తారని స్పష్టం చేశారు.  దీంతో డల్లాస్‌లో ని ప్రేక్షకులు హర్షధ్వానాలతో భారత కెప్టెన్ ప్రకటనను స్వాగతించారు. క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు రోహిత్ అమెరికా వెళ్లాడు.

జై షా చెప్పిందిదే..
టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత , బీసీసీఐ సెక్రటరీ షా మాట్లాడుతూ, ఈ విజయం తర్వాత, ఛాంపియన్స్ ట్రోఫీ , వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్  రోహిత్ శర్మ కెప్టెన్సీలో పాల్గొంటామని తెలిపారు. ఈ రెండు టోర్నమెంట్‌లలో టీమిండియా ఛాంపియన్లుగా అవతరిస్తుందని   చెప్పారు.
TAGS