Rohit Sharma : లక్నో సూపర్ జెయింట్స్ లోకి రోహిత్ శర్మ?
Rohit Sharma : ఈ ఐపీఎల్ -2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదం ఎంతకు దారితీసిందో మనం చూస్తునే ఉన్నాం. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. రోహిత్ శర్మను అకారణంగా కెప్టెన్సీ నుంచి తప్పించి అవమానపరిచిందని అభిమానులు ఇప్పటికీ మండిపడుతూనే ఉన్నారు. అయితే రోహిత్ ముంబై జట్టును వదిలి మెగా వేలానికి వస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రోహిత్ వేలంలో అమ్మకానికి ఉంటే లక్నో సూపర్ జెయింట్ దక్కించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై లక్నో అధికారికంగా ధ్రువీకరించలేదు. రోహిత్ కు ఉన్న ఫ్యాన్ బేస్ తో లక్నోకు విపరీతమైన క్రేజ్ రావడంలో సందేహం లేదు. ధోనీతో చెన్నైకి, కోహ్లీతో బెంగళూరుకు, గతంలో రోహిత్ తో ముంబైకి వచ్చిన క్రేజే లక్నోకు వస్తుంది. రోహిత్ ను దక్కించుకుంటే లక్నో దశ మారిపోవడం ఖాయం.
ముంబై ఇండియన్స్ లో తనకు జరిగిన అవమానంతో ఆ జట్టును వదిలేయాలని రోహిత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది వేలంలోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు లక్నో సిద్ధపడినట్టు సమాచారం.
ముంబై ఇండియిన్స్ కు ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ అందించిన ఘనత రోహిత్ ది. దేశవ్యాప్తంగా రోహిత్ ఎక్కడికి వెళ్లినా అతడికి ఫ్యాన్స్ ఘన స్వాగతం పలుకుతారు. ధోనీ, విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక అభిమానులు ఉన్నది రోహిత్ కే. అయితే కెప్టెన్ గా అందరి అభిమానులు రోహిత్ ను ఇష్టపడుతారు. రోహిత్ ఆటపై కూడా ప్రశంసలు కురిపిస్తుంటారు. దేశం కోసం రోహిత్ నిస్వార్థంగా ఆడుతారని, ఎప్పుడు రికార్డుల కోసం, వ్యక్తిగత ఇమేజ్ కోసం ఆడరని కితాబిస్తుంటారు. దేశం తన స్వార్థం కోసం ఆడితే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేవారని అంటుంటారు. అలాంటి ఆటగాడిని లక్నో గనుక వేలంలో కొంటే ఆ జట్టుకు ఇక తిరుగుండదనే చెప్పవచ్చు.