Rohit Sharma : ఆ క్షణంలో నా మైండ్ బ్లాక్ అయిందన్న రోహిత్ శర్మ

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma : టి20 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచినా అనంతరం టీమిండియా క్రికెటర్లు జోరుగా సంబరాలు చేసుకున్నారు. కానీ రోహిత్ శర్మ మాత్రం మైండ్ బ్లాక్ అయిందని అన్నాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లాసిన్ 24 రన్స్ కొట్టడంతో 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన దశలో తన మైండ్ బ్లాక్ అయిపోయిందని రోహిత్ శర్మ శర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.కానీ అందరం ప్రశాంతంగా ఉండి బౌలర్లు సరిగా రాణించడంతో విశ్వ విజేతగా నిలిచామని రోహిత్ అన్నాడు. రోహిత్ శర్మ ఫైనల్ లో కేవలం 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ 75 పరుగులతో రాణించాడు.

ఫైనల్ మ్యాచ్లో తీవ్ర ఒత్తిడి ఉన్న సమయంలో బుమ్రా హార్దిక్ పాండ్య రెండు ఓవర్లు హర్షదీప్ సింగ్ ఒక ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఏడు పరుగుల తేడాతో విజయం సాధించడానికి కారణమయ్యారు బౌలింగ్ విభాగం కూడా ఇంత పటిష్టంగా ఉండడం వల్లనే టీ20 ప్రపంచ కప్ సాధించామని రోహిత్ శర్మ అన్నాడు.t20 ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్లలో ధోనీ తర్వాత రోహిత్ శర్మ కావడం విశేషం. రోహిత్ శర్మ ప్రస్తుతం శ్రీలంకతో వన్డే t20 మ్యాచ్ లకు కెప్టెన్ వ్యవహరించనున్నాడు.

దాదాపు 17 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మ 2007 సంవత్సరంలో టి20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు కాగా ఆ తర్వాత  నుంచి ఒక్క ప్రపంచ కప్ కూడా గెలవలేడు.కానీ చివరగా తన కల నెరవేర్చుకున్నాడు. రోహిత్ శర్మ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత వెంటనే టి20 మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించగా జింబాబ్వే పర్యటనకు శుభమన్ గిల్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు.

TAGS