JAISW News Telugu

Rohit Sharma : రోహిత్ శర్మ నోరు తెరిచాడు.. అంతే అక్కడున్న వారంతా సైలెన్స్ 

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma : జూన్ 1 నుంచి టీం ఇండియా టీ 20 వరల్డ్ కప్ లో ఆడనుంది. ఇందులో భాగంగా మే 1న టీ 20 జాతీయ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టుతో పాటు నలుగురు ఎక్స్ ట్రా ప్లేయర్లను కూడా అమెరికా పంపుతోంది. 

అయితే రోహిత్ శర్మ, అజిత్ అగార్కర్ తో ముంబయిలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఇందులో కొన్ని సంచలన విషయాలకు సమాధానం చెప్పాడు. ముంబయి కెప్టెన్సీ నుంచి తొలగించడంపై ఏమంటారని ప్రశ్నించగా.. మన జీవితంలో ప్రతీది అనుకున్నట్లు కాదన్నాడు. కొన్ని కొన్సి సార్లు కఠిన పరీక్షలు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్లాల్సిందే అన్నాడు. 

రోహిత్ శర్మను కాదని ముంబయి హర్ధిక్ ను కెప్టెన్ గా తీసుకుంది. దీంతో ముంబయి ఇండియన్స్ అభిమానులు, రోహిత్ శర్మ ఫ్యాన్స్ ముంబయి టీం యాజమాన్యంపై విమర్శల జడివాన కురిపించారు. ఏకంగా  రెండు లక్షల మందికి పైగా ఫాలోవర్లు ముంబయి ఇండియన్స్ కు దూరమయ్యారు. అయినా నాకు వేరొకరి కెప్లెన్సీలో ఆడటం కొత్తేమీ కాదు. ప్రస్తుతం తాను హర్ధిక్ పాండ్యా కెప్టెన్సీని కూడా ఎంజాయ్ చేస్తున్నానని రోహిత్ చెప్పాడు. 

తాను మొదట్లో ఎంతో మంది క్రికెటర్ల కెప్టెన్సీలో గేమ్ ఆడాను. అప్పుడు ఎలా ఆడుతున్నానో.. ఇప్పుడు అలాగే ఆడుతున్నాను. అందులో ఎలాంటి మార్పు లేదు. అయితే మార్పు వచ్చిందని మీరు అనుకుని పొరపాటు పడుతున్నారు. ముంబయికి కూడా తాను ఏం చేయగలనో అదే చేస్తున్నారు. గేమ్ లో చివరకు విజయం సాధించడమే తమ లక్ష్యం. కానీ దురదృష్టవశాత్తు ఈ సీజన్ లో ముంబయి 10 మ్యాచ్ లకు కేవలం 3 మాత్రమే గెలిచింది. దీంతో పాయింట్స్ టేబుల్ లో తొమ్మిదో స్థానంలో ఉంది. మిగతా నాలుగు మ్యాచులు గెలిచినా కూడా ముంబయి ఇండియన్స్ ప్లే ఆప్స్ చేరడం కష్టమేనని చెప్పుకోవాలి.

Exit mobile version