Rohit Sharma : రోహిత్ కు గాయం.. ఇండియా పాక్ మ్యాచ్ కు వర్షం ముప్పు
Rohit Sharma : టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్ లో గాయపడ్డాడు. నెట్స్ లో సాధన చేస్తున్న సమయంలో త్రో డౌన్ స్పెషలిస్టు నువాన్ విసిరిన బంతి రోహిత్ బొటన వేలికి తగిలి గాయమైంది. దీంతో రోహిత్ వెంటనే పిజియోథెరపిస్టు ను సంప్రదించాడు. ఒక వేళ గాయం ఎక్కువ అయినట్లు కనిపిస్తే రేపు జరగబోయే ఇండియా పాక్ మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరమయ్యే అవకాం కనిపిస్తోంది.
రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి కూడా ప్రాక్టీస్ పిచ్ ల్లో బౌన్సర్లతో ఇబ్బంది పడ్డట్లు దీనిపై ఐసీసీ కి కూడా కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో బౌన్సర్ తో రోహిత్ భుజానికి గాయం కావడం వల్ల మ్యాచ్ మధ్యలోనే డ్రెస్సింగ్ రూం వైపునకు వెళ్లిన రోహిత్.. ప్రాక్టీస్ సెషన్ లో కూడా గాయపడటం వల్ల పాక్ తో మ్యాచ్ లో అందుబాటులో ఉంటాడో లేడోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంచితే పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ జరిగే న్యూయార్క్ నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం పరిసరాల ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఇండియా పాక్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ మ్యాచ్ గురించి ఏడాది నుంచి వేచి చూస్తున్నామని మ్యాచ్ గనక వర్షం వల్ల రద్దయితే దాని కంటే మించిన బాధ మరోటి ఉండదని వాపోతున్నారు.
అయితే ఈ సీజన్ లో ఐర్లాండ్ తో మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించగా.. పాకిస్థాన్ మాత్రం పసికూన అమెరికా చేతిలో ఓడి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో పాక్ మాజీ క్రికెటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాక్ క్రికెట్ కు ఇది అస్సలు మంచిది కాదన్నారు. షోయబ్ అక్తర్ అయితే ఆ రోజు రాత్రి నిద్ర కూడా పోలేదని వ్యాఖ్యానించాడు.