Rohit Sharma:రీసెంట్గా జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో టీమ్ ఇండియా క్రికెట్ అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. టోర్నమెంట్లో రికార్డు స్థాయిలో వరుస విజయాల్ని దక్కించుకుని ఫైనల్‌పై ఆశలు పెంచిన టీమ్ ఇండియా ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. ఈ ఓటమితో భారత అభిమానులు షాక్‌కు గురయ్యారు. వరుస మ్యాచ్‌లు గెలుపొందిన టీమ్ ఇండియా ఫైనల్‌కు వచ్చేసరికి ఇలా చేసిందేంటని అంతా వాపోయారు.
అయితే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తరువాత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడలేదు. సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్, దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టీ 20 సిరీస్‌లకు రోహిత్ దూరంగా ఉన్నాడు. అయితే దక్షిణాఫ్రికా గడ్డపై మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం రోహిత్ జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి తరువాత రోహిత్ సోషల్ మీడియా వేదికగా ఓ హార్ట్ బ్రేకింగ్ వీడియోని షేర్ చేశాడు.
ప్రపంచ కప్‌లో వరుసగా పది విజయాలు సాధించిన తరువాత ఫైనల్లో ఓటమి పాలు కావడం అందరినీ కలిచి వేసింది. ఈ నేపథ్యంలో ఫైనల్లో ఓటమి తరువాత మళ్లి ఎలా స్టేడియంలోకి అడుగు పెట్టాలో తెలియడం లేదని కెప్టెన్ రోహిత్ శర్మ వీడియోలో తన బాధను వ్యక్తం చేశారు.ఈ బాధ నుంచి తాను బయటపడటానికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎంతో సహాయపడ్డారని రోహిత్ వివరించారు. రోహిత్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A heart-breaking video of Captain Rohit Sharma about the loss in the World Cup final.
– Comeback strong, Ro. 🫡pic.twitter.com/wc8W896adH
— Johns. (@CricCrazyJohns) December 13, 2023