Rohit Sharma Comments : సెమీస్ లో గెలుపుపై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు
Rohit Sharma Comments : వరల్డ్ కప్ లో భాగంగా మంగళవారం జరిగిన భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. తొలి సెమీస్ లో భాగంగా జరిగిన ఆటలో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన బాగుంది. కివీస్ ఆటతీరు కూడా మెచ్చుకోవచ్చు. ఒక దశలో మ్యాచ్ వారి చేతుల్లోకి వెళ్తుందనే ఉద్దేశంతో ప్రేక్షకులు ఉద్వేగానికి గురయ్యారు. కానీ షమీ వారి భాగస్వామ్యాన్ని విడదీసి దెబ్బతీశాడు. దీంతో మన విజయం ఖాయమైంది. బౌలర్లు కూడా బాగా రాణించారు.
భారీ స్కోరు చేయడమే కాదు బౌలింగ్ లోనూ మనవారు ఇరగదీశారు. దీంతోనే విజయం సాధ్యమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 397 పరుగుల భారీ స్కోరు సాధించింది. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఒక దశలో మన వారిని కంగారుకు గురి చేశారు. చివరకు 70 పరుగుల తేడాతో ఇండియా విక్టరీ కొట్టడంతో ప్రేక్షకుల్లో సంతోషం వెల్లివిరిసింది.
మ్యాచ్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఆటలో ఒత్తిడి ఎప్పుడు ఉంటుంది. భారీ స్కోరు చేసినా విజయం అంత సులువు కాదు. పోరాడాల్సిందే. డారిల్ మిచెల్ కేన్ విలియమన్స్ ల ఆటతీరు బాగుంది. ప్రత్యర్థి ని ఎలా కట్టడి చేయాలనే దానిపై వ్యూహం ఉండాలి. అవగాహన కావాలి. ఈ మ్యాచ్ లో షమీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. అతడి ప్రదర్శన మంచిగుంది.
మనవారు ఆరుగురు బ్యాటర్లు రాణించడం బాగుంది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. కోహ్లి అత్యధిక సెంచరీలు సాధించిన వాడిగా రికార్డు నెలకొల్పడం సంతోషం. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించాం. 9 మ్యాచ్ ల్లో ఎలా ఆడామో ఈ మ్యాచ్ లో కూడా అలాగే చేశాం. దీంతో ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు.