Rohith Sharma : టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతోనే కాదు తన ప్రవర్తనతో సైతం అందరినీ ఆకట్టుకుంటాడు. సొంత రికార్డులను పక్కనపెట్టి మరీ దేశం కోసమే ఆడుతుంటాడు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి డౌట్ లేదు. చెన్నైతో నిన్న జరిగిన మ్యాచ్ లో అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్ గా వచ్చి వికెట్ ను కాపాడుకుంటూ చివరి బాల్ దాక నిలిచాడు. అయినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. దీంతో సెంచరీ కోసమే రోహిత్ స్లోగా ఆడాడని, అందువల్లే ముంబై ఓడిపోయిందని స్వార్థపరుడు అంటూ హిట్ మ్యాన్ ను విమర్శిస్తూ.. ట్రోల్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఇదిలా ఉండగా ఫ్యాన్స్ గుండెలు పగిలే వీడియో ఒకటి బయటకు వచ్చింది. రోహిత్ ను ఇంత బాధతో ఎప్పుడూ చూసుండం.
ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన శతకంతో దుమ్మురేపాడు రోహిత్ శర్మ. అయినప్పటికీ పలువురు అతడిపై విమర్శిస్తున్నారు. సెంచరీ చేసుకోవడం కోసం స్లోగా బ్యాటింగ్ చేయడంతో ముంబై ఓడిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు రోహిత్ అలాంటివాడు కాదని, అతడి చరిత్రను చూస్తే తెలుస్తుందని కొందరు మద్దతు పలుకుతున్నారు. అయితే మ్యాచ్ ఓడిపోవడంతో.. ఎంతో బాధగా గ్రౌండ్ నుంచి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయాడు రోహిత్. కనీసం ఇతర ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడం కూడా చేయలేదు.
సహచరులంతా ఒక వైపు ఉంటే.. వారికి దూరంగా పోరాటం చేసి ఓడిపోయిన యోధుడిగా వెళ్లిపోయాడు. తలను కిందకేసి, ఎంతో బాధతో అడుగులు వేస్తూ హిట్ మ్యాన్ అలా వెళ్తుండడాన్ని చూసిన ఫ్యాన్స్ గుండెలు పగిలిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన అభిమానులు ఇలా తమ ఆరాధ్య క్రికెటర్ ను జీవితంలో ఇంతవరకు చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయం సాధించలేకపోయినా..నీ పోరాటానికి హ్యాట్సాఫ్ అంటూ మరికొందరు ప్రశంసిస్తున్నారు.
@ImDrago45 pic.twitter.com/1mLrPoZqPO
— Rohit is the GOAT🐐 (@dranzertweets) April 15, 2024