Rohit – Virat : శ్రీలంక తో వన్డేలకు  రోహిత్, విరాట్ దూరం.. కెప్టెన్ గా ఎవరంటే..

Rohit - Virat

Rohit – Virat

Rohit – Virat : టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లి, జస్ ప్రీత్ బుమ్రా శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది.  ఇప్పటికే బిజీ షెడ్యూల్ తో తీరిక లేకుండా ఉండటంతో వీరూ ఈ సిరీస్ కు దూరం కానున్నారు. దీంతో శ్రీలంక తో వన్డే సిరీస్ కు కే ఎల్ రాహుల్ లేదా హర్దిక్ పాండ్యా ఇద్దరిలో ఒకరు కెప్టెన్సీ చేయనున్నారు.

టీం ఇండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ సక్సెస్ ఫుల్ గా టీ  20 ప్రపంచ కప్ లో విశ్వ విజేత గా నిలవడంతో యావత్ దేశం సంబరాల్లో మునిగిపోయింది. అయితే వెంటనే రోహిత్, కొహ్లి ఇద్దరు కలిసి ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లిపోయారు. రోహిత్ శర్మ శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత వెంటనే బంగ్లాదేశ్ తో  జరగబోయే రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు అందుబాటులోకి వస్తాడని ప్రచారం జరుగుతోంది.

ఆ తర్వాత న్యూజిలాండ్ తో టీం ఇండియా మూడు టెస్టులు ఆడుతుంది. దీనికి కూడా రోహిత్ శర్మనే కెప్టెన్ గా కొనసాగే అవకాశం ఉంది. అనంతం బోర్డర్ గావస్కర్ ట్రోపీ జరగనుంది. దీని కోసం ఆస్ట్రేలియాకు టీం ఇండియా వెళ్లనుంది. గత బోర్డర్ గావస్కర్ ట్రోపీలో రిషబ్ పంత్, శుభ్ మన్ గిల్ ఇద్దరు యువ ప్లేయర్లుగా అడుగుపెట్టి సూపర్ సక్సెస్ అయ్యారు.

అదే సిరీస్ లో మహ్మద్ సిరాజ్ సెలెక్ట్ కావడం. ఆ తర్వాత ఆయన తండ్రి మరణించినా కూడా ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు. అనంతరం తుది జట్టులో చోటు సంపాదించుకున్న మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించి అందరి దృష్టిలో పడిపోయాడు. దీంతో సిరాజ్, టీ 20, వన్డే టీంలో చోటు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టాప్ బౌలర్ గా ఇండియా వన్డే, టీ 20 టీమ్ లో కొనసాగుతున్నాడు.

TAGS