Mumbai : ముంబై నగరంలో వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలకు రోడ్లు జలమయం కావడంతో స్కూల్స్, కాలేజీలు మూసివేశారు. యూనివర్సిటీల్లో పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఈరోజు (జులై 8 సోమవారం) భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముంబై కార్పొరేషన్ అధికారులు అత్యవసరం అయితేనే బయటకు రావాలని ప్రజలను హెచ్చరించారు. చాలా ప్రాంతాల్లో రూడ్లపై నీళ్లు నిలిచి ట్రాఫిక్ జాం అవుతుందని తెలిపారు.
అంతేకాకుండా, రాబోయే రెండు, మూడు రోజులు (జులై 9, 10) భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ముంబైలో వానలు దంచికొడుతున్నాయి. ఠానేలోని రిసార్ట్ లో చిక్కుకుపోయిన 49 మందిని ఎన్డీఆర్ఎఫ్ టీం కాపాడింది. పట్టాలపైకి నీరు చేరడంతో పాటు చెట్లు పడడంతో ఠానే జిల్లాలోని కసారా, టిట్వాలా మధ్య లోకల్ ట్రైన్స్ ను ఆపేశారు.