Road accident : తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

Road accident
Road accident : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం కలగడ నుంచి చెన్నైకి టమాట లోడ్ తో వెళ్తున్న కంటైనర్ లారీ చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో కారును, మరో బైక్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు.