
Mangalagiri
Mangalagiri : మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదే మార్గంలో వెళ్తున్న మంత్రి సవిత ప్రమాదాన్ని గమనించి కాన్వాయ్ ఆపి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆటోను కారు ఢీకొన్న ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
అదే మార్గంలో వెళ్తున్న మంత్రి సవిత ప్రమాదాన్ని గమనించారు. కాన్వాయ్ ఆపి సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మంచినీరు తాగించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. దగ్గరుండి క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు.