Road accident : కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు హైదరాబాద్ వాసులు మృతి

Road accident
Road accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుల్బార్గా జిల్లా కమలాపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బొలేరో వాహనం కారును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు హైదరాబాద్ లోని యూసుఫ్ గూడకు చెందినవారిగా గుర్తించారు. గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వీరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.