Road accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ఇండియన్స్ మృతి

Road accident
Road accident in USA : అమెరికాలోని రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇండియన్స్ మృతి చెందారు. వారిలో ఒక మహిళ సహా ముగ్గురు ఏపీ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు. రాష్ట్ర రహదారిపై దక్షిణ బాన్ హామ్ కు ఆరు మైళ్ల దూరంలో సాయంత్రం 6.45 గంటలకు (అమెరికా కాలమానం) రెండు వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి సంబంధించి పూర్వాపరాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉందని అక్కడి ప్రవాస భారతీయ ప్రతినిధులు తెలిపారు. ఈ ఘటనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.